Computer Vinayakudu

“ కంప్యుటర్ వినాయకుడు "

యస్.కిరణ్ కుమార్

వినాయకుడు,కుమారస్వామి సరదాగా ఆడుకుంటుండగా...వాళ్ళ దగ్గరికి నారదుడు వస్తాడు.

“ నారధ మహర్షిలకి నమస్కరాలు" ఇద్దరు రెండు చేతులు జోడించాడు.

“ చిరంజీవులకు ఆశీస్సులు...సరదాగా ఆడుకుంటున్నారా...”

“ అవును " అన్నారిద్దరూ.

“ నాకొక సందేశం వచ్చి...ఇటుగా వచ్చాను "అన్నాడు నారదుడు.

“ ఏమిటో చెప్పండి నారద మహర్షి"

“ మీ యిద్దరిలో శివపార్వతులు ఎవరికీ నాయకత్వం అప్పగిస్తారాని...”

వినాయకుడు,కుమారస్వామి...యిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

“ నారాయణ.. నారాయణ... “ అంటూ అక్కడి నుండి నారదుడు వెళ్ళిపోయాడు.

అక్కడి నుండి వెంటనే వినాయకుడు,కుమారస్వామి...శివపార్వతుల దగ్గరికి వస్తారు.

యిద్దరిలో నాయకత్వం ఎవరికీ ఇస్తారని నిలదీస్తారు.

“ ఈ భూమండలం చుట్టూ ఒక్కసారి ఎవరు వేగంగా తిరిగివస్తారో..వారికే నాయకత్వం ఇస్తాను " అని చెప్పాడు శివుడు.

కాసేపు ఆలోచించిన కుమారస్వామి...అమెరికా నుండి అర్జంటుగా ఓ రాకెట్ తెప్పించుకుని ప్రయాణం ప్రాంభించాడు.

తీరా భూమండలమంతా తిరిగివచ్చేసరికి వినాయకుడు నాయకుడయ్యాడు.

“ అన్నగారూ...మీకీ ఆధిపత్యం ఎలా వచ్చింది ?”అని అడిగాడు కుమారస్వామి తేరుకుంటూ.

“ ఆఁ...ఏంలేదు...అదిగో ఈ కంప్యుటర్ చుట్టూ ఓసారి తిరిగేశాను.దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా...అలా గెలిచేశా...” అన్నాడు వినాయకుడు నవ్వుతూ.