NAVVULE-NAVVULU-5

నవ్వులే నవ్వులు - 5

" ఆకాశంలో బాంబులు "

“ఏమండీ...పిల్లలకు బాంబులు కొనలేదేం! ”

కోపంగా అడిగింది సత్యవతి.

“ వాటి రేట్లు ఆకాశంలో వున్నాయి.ఆకాశంలోకి

వెళ్లి వాటినెలా వెలిగిస్తామని కొనలేదు! ”

భయపడుతూ చెప్పాడు కృష్ణమూర్తి.

" పదమూడో అంతస్థు "

" తొందరగా దూకేయ్...అవతల పోలీసులు వచ్చేస్తున్నారు "

“ నీకేమైనా పిచ్చెక్కిందా...మనం ఇప్పుడు పదమూడో అంతస్థులో వున్నాం "


“ పదమూడో నంబరు,ఏడో నెంబరు అంటూ మూఢ నమ్మకాలు,చాదస్తాలు

పెట్టుకోకు... దూకేయ్ " అంటూ కసిరాడా నాస్తిక దొంగ.

" బరువైన కథలు "

“ఈ పత్రిక ఎడిటర్ కి పేపర్ కొట్టు కూడా వున్నట్టుంది.” అన్నాడు త్రివిక్రమ్.

“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు

? ” అడిగాడు సునీల్.

“పోటీకి పంపే కథలు కనీసం కేజీ బరువుండాలి

అంటూ సూచించారు మరి...” చెప్పాడు త్రివిక్రమ్.

" కోపిష్టి భార్య "

“ఏమండీ...ఆ ఎదురింటాయనను చూశారా!ప్రతిరోజూ

ఆఫీసుకెళ్ళేముందు ఎంచక్కా వాళ్ళావిడకో

ముద్దిచ్చి,టాటా చెప్పి వెళుతుంటాడు.మరి

మీరున్నారు ఎందుకూ ?” కోపంగా అంది భార్య.

“ఆడిపోసుకుంటావెందుకే అలా చేయడం నాకూ యిష్టమే.

కానీ ఆవిడ ఒప్పుకోవాలిగదా !” అయోమయంగా అన్నాడు భర్త.

“ ఇన్సురెన్స్ నాన్న "

“ మమ్మీ!నేను నాన్నతో ఈతకు వెళ్తాను.” అన్నాడు అబ్బాయి.

“ వద్దు బాబూ...నీకు ఈతరాదు గదా... ప్రమాదం!”అంది తల్లి.

“ మరి నాన్నకు గూడా ఈతరాదు గదా మమ్మీ !” అన్నాడు

అబ్బాయి. “

నాన్నకు ఈతరాకున్నాఫరువాలేదు,ఇన్సురెన్సు వుంది గదా బాబూ !” అంది తల్లి.