Daari cheppandi please

" దారి చెప్పండి ప్లీజ్..”

ఎన్.నాగమణి

నగరం నుంచి మరో పట్టణానికి కార్లో బయలుదేరింది ఒక జంట. ఓ పల్లెటూరి ప్రాంతంలో దారి తప్పిపోయామన్న అనుమానం వచ్చింది ఆ జంటకి.

దాంతో కారు దిగిన ఆ జంట, చుట్టుపక్కల చూస్తుండగా...వాళ్లకి కొద్ది దూరంలో నిలబడి అయోమయంగా అటు ఇటు చూస్తున్న ఒక రైతు కనిపించాడు.

అతని దగ్గరికి వెళ్లారు ఆ జంట.

“ బాబూ...” పిలిచాడు కిశోర్.

“ ఏమిటి..? ” అన్నాడు ఆ రైతు.

“ బాబూ...మళ్ళీ రోడ్డు మీదకు చేరాలంటే ఏ దారినా వెళ్ళాలి " అని అడిగాడు కిశోర్.

ఆ రైతు బుర్ర గీక్కుంటూ " ఈ దారినవెళితే బహుశ వెళ్తారామో...” అన్నాడు.

“ వీడిని అడిగి లాభం లేదండీ.వట్టి వెర్రిబాగులోడిలా వున్నాడు " అన్నది కిశోర్ భార్య రమణి.

“ ఏంటమ్మో...మాటలు సరిగ్గా రానివ్వండి.నేను వెర్రోడినా ? దారి తప్పింది నేనొక్కడినే కాదమ్మా మీ యిద్దరూ కూడా...ఆ సంగతి గుర్తుంచుకోండి " అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రైతు.