Mugguru Goppa Natulu

" ముగ్గురు గొప్ప నటులు "

యస్.కిరణ్ కుమార్

ఒక రోజున...చిరంజీవి, నాగేంద్రబాబు,పవన్ కళ్యాణ్...ముగ్గురు కలిసి బస్టాండ్ లో  నిల్చుని సరదాగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

“ నేను పోలీసు వేషం వేస్తె రౌడీలు మామూళ్ళు తెచ్చి నా చేతికిచ్చారు.” అన్నాడు నాగేంద్రబాబు.

“ నేను రాజకీయ నాయకుడి వేషం వేస్తె జనం రాస్తారోకో చేసి అసలు కదలనివ్వరు తెలుసా ? ” గర్వంగా అన్నాడు చిరంజీవి.

పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడకుండా తలదించుకుని వున్నాడు.

“ ఏరా పవన్...సైలెంటయిపోయావేంటి నీ సంగతి చెప్పు " అని ఇద్దరు అన్నారు.

“ నేను పులి వేషం వేస్తె...తీసుకెళ్ళి 'జూ 'లో పెట్టారు " దీనంగా అన్నాడు పవన్ కళ్యాణ్.

ఇద్దరు పకపక నవ్వారు.