Chilipi Premalekha

" చిలిపి ప్రేమలేఖ "

యస్.యస్.కృష్ణ.

మొదటి చూపులోనే కాంచనమాలని చూసిన సుధీర్,తన మనస్సుని ఆమెపై పారేసుకున్నాడు. ఎలాగనైనా తను ఆమెను ప్రేమిస్తున్న విషయం చెప్పలనుకున్నాడు.

ఎలా అని కొద్దిసేపు అరుగు బయట మంచం వేసుకుని, అందులో పడుకుని ఆకాశంలోకి చూస్తూ, మరికొద్దిసేపు గేటు దగ్గర అటూ ఇటూ పచార్లు చేస్తూ,ఇంకొద్దిసేపు ఇంటికి అతి దూరంలో ఉన్న వేపచెట్టు ఎక్కి...ఆలోచించాడు. ఒక్క ఆలోచన కూడా అతని మట్టి బుర్రలోమొలకెత్తలేదు.

" ఛ " విసుగ్గా అనుకుంటూ రోజు కాంచనమాలని చూస్తూ...ఎలాగైనా ఈ రోజు ప్రేమలేఖ రాయాలని అనుకుంటూ ఏ రోజుకారోజు ఆలోచనలతో గడిపెస్తుండగా,ఒకరోజు ఉదయాన్నే రేడియోలోవస్తున్నా పాటని వినగానే...అతనికి ఒక ఆలోచన వచ్చింది.

వెంటనే గబగబా తన రూములోకి వెళ్లి ఒక పేపర్ పెన్ను తీసుకుని శ్రద్దగా రాసి,ఆ పేపరును మడిచి జేబులో పెట్టుకుని దారిలో అర్చన కోసం ఎదురుచూస్తుండగా...కాంచనమాల రానే వచ్చింది.

గబుక్కున జేబులో నుండి మడిచిన పేపరును తీసి అర్చన ముందు విసిరాడు. కాంచనమాల, సుధీరుని అదోలా చూసింది.  సుధీరు సిగ్గుపడుతూ,మెలికలు తిరిగిపోతున్నాడు. కాంచనమాల ఆ పేపరును తీసుకుని చూసింది.

  " ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్డు, ప్రేమికుల రోజు. ప్రియమైన నీకు - కాంచనమాల - మనసంతా నువ్వే - నువ్వు నాకు నచ్చావ్ - నువ్వులేక నేనులేను - ప్రేమించుకుందాం రా - సప్తపది - కలిసినడుద్దాం - పెళ్లి చేసుకుందాం రా -ప్రేమతో, బద్రి.” అని అందులో రాసి ఉన్నది చదివి, సుదీరుని చూసింది.

సుధీరు సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతున్నాడు. వెంటనే కాంచనమాల పెన్ను తీసి గబగబా ఆ పేపరులో రాసి సీరియస్ గా అతని ముఖాన్నా విసిరి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దానిని సంతోషంగా తీసుకుని మడతలు విప్పి చూశాడు.

“ నాన్నగారు - చండశాసనుడు - అన్నయ్య - హిట్లర్ - తమ్ముడు - కిరాతకుడు - మాతోపెట్టుకోకు - టాప్ లేచిపోద్ది " అని.

“ ఆ..” అని ఆశ్చర్యంగా నోరు తెరిచినా సుధీర్ అక్కడి నుండి గబగబా కింద మీద పడుతూ పరుగు తీశాడు.