TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
నవ్వులే నవ్వులు - 4
నవ్వడం ఒక యోగం.
నవ్వలేకపోవడం ఒక రోగం.నవ్వుని మించిన ఔషదం మరొకటి లేనేలేదు.
అందుకే హాయిగా,సరదాగా,నవ్వుకోవడానికే మా ఈ నవ్వులే నవ్వులు.
"చాల్లే సంబరం"
దుర్గకు ముప్ఫయ్యేళ్ళు దాటినా ఇంకా ముఖంలో నేవళత్వం అలాగే ఉంది. అంత
వయసున్నట్టు బొత్తిగా కనిపించదు.ఆమెని చూస్తే ఒక సోపుల ప్రకటన గుర్తొస్తుంది. అలా కితాబు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో " మీరే కాలేజ్ ?” అని అడిగింది పక్కింటి లలిత.
“ చాల్లే సంబరం...నేను కాలేజేంటి.స్కూలు చదువే
తిన్నగా పూర్తి కాలేదు " అనేసింది కవిత.
“ పోరా బాబు "
“ డాడీ !హోమ్ వర్క్ చేసిపెట్టవా ?” అడిగాడు కొడుకు.
“ పొరాబాబూ...ఇవతల నా 'హోమ్ వర్కే చెయ్యలేక చస్తున్నా'అంటూ వంటింట్లో అంట్లు తోముతున్నాడు తండ్రి.
“ అనుమానం "
“ఏమండీ ! ఇవాళ కొత్త సినిమా ఏదయినా రిలీజ్ అయిందా?” అడిగింది అన్నపూర్ణ.
“ఏం అయినట్టు లేదే, అయినా నీకెందుకొచ్చిందా అనుమానం?” అడిగాడు సుందరం.
“ఎప్పుడూ లేనిది మనవాడు పొద్దున్నే లేచి స్నానం చేసి కాలేజీకి వెళుతున్నానని చెప్పి
బయల్దేరితే అనుమానం వచ్చింది...” అంది అన్నపూర్ణ.
“ నమ్మండి సార్ "
“ఇంత మురికినీళ్ళా తాగడానికి ఇచ్చేది?” కోపంగా అడిగాడు రాహుల్.
“నేను చెప్పేది నమ్మండి సార్.. ఇవి నిజంగా మంచి నీళ్ళే..,
గ్లాసులే మురికివి ...” అన్నాడు సర్వర్.
" చెల్లు "
“రామూ, యీ లవ్ లెటర్ తీసికెళ్ళి మీ అక్కకు ఇవ్వు? ఈ కవర్లో కాడ్బరీ చాక్లెట్స్ ఉన్నాయి.. ఇవి కూడా తీసుకో”
“లెటర్ ఇస్తాలే, చాక్లెట్స్ అక్కర్లేదు!”
“ఏం? ఎందుకని?”
“పొద్దున్న మా అన్నయ్య, మీ చెల్లెలికి లవ్ లెటర్ ఇవ్వమంటే, ఇచ్చాను. దానికి దీనికి చెల్లు" రాము.
|