Maha medhavi rambabu

మహామేధావి రాంబాబు

నండూరి పార్థసారథి

రాంబాబుకు 20 ఏళ్లు ఉంటాయి.

ఇటు చదువుకుంటూ అటు చింతలబస్తీలోని 'సుజనమిత్ర' అనే లార్జెస్ట్ సర్కులేటేడ్ డెయిలీ ఫ్రమ్ లో పార్ట్ టైము ఉద్యోగం చేస్తూ...తన అరకొర తెలివితేటలతోనే తను మహామేధావి నని తెగ ఫీల్ అయ్యి పోతుంటాడు.

ఇంగ్లీష్,తెలుగు సరిగా రాక కొంత,స్వేచ్చానువాదాల వల్ల కొంత,కుతర్కం వల్ల కొంత, అమాయకత్వం, అజ్ఞానం, అతితెలివి వల్ల కొంత...రకరకాలుగా తనకు తెలియకుండానే మనకు ఎంతో హాస్యాన్ని పంచాడు మన మహామేధావి అయిన రాంబాబు గారు.

అతడి వింత ఆలోచనా ధోరణికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం.

మూడు కోతుల బొమ్మ నీతి నేర్పుతుందంటే నేను నమ్మను.ఆ లెక్కన ప్రపంచంలోని గుడ్డివాళ్ళు,చెవిటివాళ్ళు, మూగవాళ్ళు అంతా నీతి మంతులే అయ్యుండాలి.

అసలు దేవుడు...కళ్ళు, చెవులు, నోరు ఇచ్చింది దేనికి ?అన్నీ చూసి,అన్నీ విని, ఏది మంచో ఏదో చెడో విచాక్షించుకుని, మంచిని మాట్లాడాలి.వాటిని మూసుకుంటే మంచిని కూడా చూడలేము,వినలేము,మాట్లాడలేము.

కృతి యొక్క టెక్నిక్ తెలిసిపోయింది.ఇందులో పల్లవి, అనుపల్లవి చెరోలైను,చరణం మూడు, నాలుగు లైన్లు వుంటాయి.తిప్పి తిప్పి కొడితే అంతా కలిసి ఐదారు లైన్లు.ఆ తరువాత పాడేదంతా స్వరకల్పనే.దాని సంగతి కచేరి చేసే గాయకుడు చూసుకుంటాడు.మనకేం సంబంధం లేదు.మినీ కవితలాగా ఓ ఐదారు లైన్లు రాసి పడేస్తే మన పని తీరిపోతుంది. ఇన్నాళ్ళూ మినీ కవితలతో టైము వేస్టు చేశాను.శుభ్రంగా కృతులు రాసి వుంటే బోలెడు కీర్తి ప్రతిష్టలు వచ్చి వుండేవి.

“ ఇప్పుడు నేను మహామహుణ్ణి కాను...నిజమే.కాని ఎప్పటికీ కాలేనని ఎలా చెప్పగలవు.?మా తాతగారు ఎనభై ఏళ్ళు బతికాడు.ఇప్పుడు నాకు ఇరవై ఏళ్లు.ఇంకో యాభై, అరవై ఏళ్ళకైనా మహామహుణ్ణికాలేకపోతానా ?యాభైఏళ్ళకైనా నేను మహావాగ్గేయకారుణ్ణి కాకపొతే యింకేందుకు వేస్టు " అన్నాను.

“ ఏమిటోరా...మాలాంటి ఇంటలెక్చువల్స్ కి ఎంత సేపూ ఉన్నత విషయాలే తప్ప చిన్న చిన్న విషయాలు తెలియవు.గాంధీ గారికి చాప్లిన్ ఎవరో తెలీదుట " అన్నాను.

అసలు నా సొంత ఆత్మసాక్షే నన్ను సమర్థించక పోతే భాస్కరరావు ఆత్మ, సారధి ఆత్మ, బాబూరావు ఆత్మ సమర్థిస్తాయా ?