TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
సినీ 'హాసం'
యస్.కిరణ్ కుమార్
చేయాల్సిన పనిని ఆర్నెల్లకి చేస్తాడని ఎప్పుడూ ప్రొడక్షన్ మేనేజరుని విసుక్కుంటూ ఉండేవాడు దర్శకుడు.
అంచేత దర్శకుడు తన అసిస్టెంట్లతో చర్చించేదంతా తలుపు ఇవతల చాటున నిల్చుని విని, వారికి ఫలానాది కావాలని నిశ్చయించుకున్నాడు ప్రొడక్షన్ మేనేజర్.
ఒకవాడు దర్శకుడు వచ్చేసరికి, ఆయన టేబుల్ మీద పెద్ద ఇంకు బాటిల్ ఉంది.
బెల్ కొట్టి " ఏ బాయ్ " అని అరిచాడు దర్శకుడు.
బాయ్ పరుగెత్తుకు వచ్చాడు.
“ ఏమిటిది ?” అని అడిగాడు.
“ నాకు తెలియదు సార్.మేనేజర్ పెట్టాడు " అని చెప్పాడు.
“ సరే...మేనేజరును పిలువు " అన్నాడు.
బాయ్ వెళ్లి మేనేజర్ కు చెప్పగానే, ఆ మేనజర్ దర్శుకుడి దగ్గరికి వచ్చాడు.
“ ఏం సార్..పిలిచారట "?
“ ఏమిటయ్యా ఈ ఇంకు బాటిల్ "
“ అదేసార్...నిన్న మీరూ కవిగారూ కలిసి మాట్లాడుకుంటూ ఇంకు బాటిల్ చెప్పించాలనుకున్నారు కదండి!మీరు నాకు చెప్పడం మర్చిపోయారు.అయినా నేను వెళ్లి వెంటనే తెచ్చేశాను " అన్నాడు మేనేజర్.
“ ఇంకు బాటిల్ కాదయ్యా మహాశయా.ఎంకి పాటలు !” అన్నాడు దర్శకుడు.
|