TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మంజీర
అనగనగా హీరో. అతనికి వారసత్వంలో డబ్బు కలిసివచ్చింది. అతనికో గళ్ ప్రెండ్. వాళ్ళ నాన్నకీ డబ్బుంది కానీ కష్టార్జితంపై ఆధారపడిన వాడికే కూతుర్నిస్తానన్నాడు. అందుచేత వారసత్వపు డబ్బు ముట్టుకోకుండా,డబ్బు సంపాదించి ఆయనకి చూపిద్దామని హీరో తాపత్రయం.
ఒకసారి ఓడలో హీరో, గళ్ ప్రెండు వస్తుండగా ఓ డబ్బున్నాయన, అతని భార్య కనబడ్డారు. భార్యకో ఖరీదైన నెక్లెస్ ఉంది.కానీ అది బయటపడితే పన్నుకట్టవలసి వస్తుంది.అది ఆవిడకి సుతరామూ ఇష్టం లేదు. హీరో, ఫ్రెండ్ కలిసి టెడ్డీబేరులో పెట్టి ఆ నెక్లెసును బయటకు స్మగుల్ చేసేశారు.
తర్వాత పోలీసులకి చెప్పెస్తామని ఆయన్ని బెదిరించారు. అందుకు ఆ డబ్బున్నాయన " ఎవరికీ చెప్పక...మా అడ్వర్టయిజ్మెంట్ కంపెనీ ఓ బ్రాంచ్ లో ఉద్యోగం ఇస్తా.చేసుకో " అన్నాడు.
హీరో పనిచేసే కంపెనీలోనే అతని సెక్రటరీగా ఓ అమ్మాయి చేరింది.అతనంటే ఆరాధన పెంచుకుంది.కానీ హీరో ఆలోచనలన్నీ గళ్ ఫ్రెండ్ చుట్టూరా తిరుగుతూ ఉంటాయి.సెక్రటరీని ఓ ప్రెండుగా భావించి విషయాలన్నీ చెబుతుంటాడు.
ఓ ఏడాది నడిపాక ఇక చాల్లే అనుకుని బ్రాంచ్ మూసేసాడు. సెక్రటరీని వేరేచోట ఉద్యోగం చూసుకొమ్మని చెప్పాడు.గళ్ ఫ్రెండు తండ్రి వద్దకు వెళ్లి పెళ్ళికి అనుమతి అడిగాడు.
“ నువ్వు ఈ ఉద్యోగం ఎలా సంపాదించావో మా అమ్మాయి చెప్పేసింది.ఇది నీ కష్టార్జితం కాదు.వెళ్లి కష్టపడి సంపాదించుకురా.అప్పుడు ఆలోచన్ చేద్దాం " అన్నాడు.
చేతిలో డబ్బున్నా హీరో ఉద్యోగాల వేటలో పడ్డాడు.అప్పుడు అక్కరకు వచ్చింది సెక్రటరీ. ఇప్పుడా అమ్మాయి ఓడలో కలిసిన డబ్బున్నాయన భార్య దగ్గర సెక్రటరీగా పని చేస్తోంది. ఆవిడ ఆయనకు ఐదవ భార్య.చాలా డామినేటింగ్.
డబ్బున్నాయనకు పేరుకే డబ్బుంది.కానీ అంతా భార్యతో జాయింటు ఎక్కవుంటులో ఉంది.అనుభవించడానికి లేదు.మనసారా తిండి తినడానికి లేదు.(అనారోగ్యం ఉంది లెండి ). సెక్రటరీ తన యజమానురాలి వద్దకు హీరోని తీసుకెళ్ళి ఓ జమీందారు మేనల్లుడని చెప్పి, ప్రస్తుతం ఉద్యోగం కావాలని చెప్పింది.
డబ్బున్నాయన కారు డ్రైవరుగా మాత్రమే ఉద్యోగమే ఖాళీ ఉందంటే...దానికి సరేనన్నాడు హీరో. తన స్వంత డబ్బుతో ఆయనకు అవీ ఇవీ కొనిపెట్టి ఆత్మీయుడయి పోయాడు.భార్య అతనిచేత బలవంతంగా డైటింగ్ చేయిస్తూంటే జాలిపడ్డాడు.
ఓ అర్దరాత్రి సెక్రటరీ ప్రోద్బలంతో ఆయనకోసం కేకు పట్టుకెళుతూంటే ఆయన సవతి కూతురు కళ్ళల్లో పడ్డాడు.ఆమె ఇతన్ని దొంగ అనుకుని గదిలో పెట్టి గడియవేసింది.డబ్బున్నాయన సహాయంతో హీరో ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాడు.
ఈ సవతి కూతురు డబ్బున్నాయన ప్రస్తుత భార్యకు పూర్వ వివాహం వల్ల పుట్టిన అమ్మాయి.పెళ్లి కాలేదు.వేరేచోట ఉంటుంది.తల్లి దగ్గర ఉన్న ఓ ఖరీదైనా ముత్యాలహారం గురించీ మహావర్రీ అవుతూ ఉంటుంది.దాన్ని పెళ్ళికి బహుమతిగా ఇస్తానని తల్లి ప్రామిస్ చేసింది.
అదెక్కడ పోతుందోనని ఆమెకు భయం.తల్లికి చెప్పి ఓ డిటెక్టివ్ ను ఏర్పాటు చేయించింది.వాడే ఓ నాసిరకం దొంగ.ఆర్భాటం చేసుకుంటూ వచ్చేసరికి ఇంట్లో అప్పటికే తిష్ట వేసుకుని కూచున్న ఓ టక్కరి జంట కనబడ్డారు.
ఆ జంటలో భర్త స్కీములు పేరు పెట్టి జనాలను ఆకర్షిస్తూ ఉంటాడు.భార్య ఇంకా దైర్యవంతురాలు.సమయం చూసి వస్తువులు మూట గట్టుకుని పారిపోతూ ఉంటుంది. వాళ్ళను చూడగానే గుర్తుపట్టి డిటెక్టివ్ బేరానికి దిగాడు.
"వీళ్ళ దగ్గర్నుంచి హారం కొట్టేద్దాం.నాకు 60% తక్కినది మీకు " అన్నాడు.
"ఆ పప్పులేం ఉడకవ్ "అన్నారు వాళ్ళు. పగలు హీరోని చూసి సవతికూతురు అనుమాపడింది.రాత్రి తనకు ఎదురయిన దొంగ వీడేనా అని తల్లిని హెచ్చరించబోయింది.
“ అబ్బే..అతను ఓ జమీందారి మేనల్లుడు " అని కొట్టి పారేసింది తల్లి. హారం కొట్టేయడానికి టక్కరి జంట వాళ్ళు ఓ ప్లాను వేశారు.
“ ఎవరో దొంగ బయట నుండి వచ్చినట్టు హడావుడి చేసి ఆవిణ్ణి బయటకు లాక్కోస్తాను.నువ్వు వెళ్లి హారం పట్టుకొచ్చేయ్ " అని భర్తకు చెప్పింది భార్య.
చెప్పినట్టుగానే అలాగే చేసింది.కానీ భర్త దొంగలించే సమయానికి అక్కడికి డిటెక్టివ్ దావురించాడు. జాగ్రత్త అని హెచ్చరించి వదిలేసాడు. దొంగాడు కనబడక తిరిగి వచ్చిన డబ్బున్నావిడ వద్దకు కూతురు వచ్చి "హీరోయే దొంగాడు. నిన్ను చూసి పారిపోయి వుంటాడు.” అని మళ్ళీ చెప్పింది.
ఈలోగా హీరో తన గళ్ ఫ్రెండుకి తన పరిస్థితిని వివరిస్తూ ఉత్తరం రాసాడు.ఆ అమ్మాయి అమాయకంగా తండ్రికి అంతా చెప్పేసింది.ఓ జమీందారు మేనల్లుడని అబద్దం చెప్పుకుని హీరో ఉద్యోగం సపాదించడం అతనికి నచ్చలేదు.డబ్బున్నాయన్ని డిన్నర్ కి పిలిచి మీ డ్రైవరు సంగతి ఇదీ అని చెప్పేశాడు.
డబ్బున్నాయన హీరోనే సమర్దించాడు. ఇంటికి తిరిగొచ్చి ఇలాంటి కండిషన్లు పెట్టె అమ్మాయిని పెళ్లి చేసుకోకు అని ఉచిత సలహా పారేశాడు. సెక్రటరీ లాంటి మంచి అమ్మాయిని చేసుకో అన్నాడు పైగా.
“ లేదు.ఆ అమ్మాయి వేరేవర్నో ప్రేమిస్తోంది.అతన్ని వెతుకుతూనే ఈ ఊరువచ్చానని నాతో చెప్పింది " అన్నాడు హీరో.
నిజమే ఆ అమ్మాయి బహిరంగంగా హీరోతో తన ప్రేమ వెల్లడించలేక అలాగే చెప్పింది. ఇది ఇలా ఉండగా ఊళ్ళో ఓ పార్టీ జరిగింది.అక్కడ డబ్బున్నాయన,హీరో,సెక్రటరీ వెళ్లి డాన్సు చేసి నానా హడావిడి చేసేరు.
పోలీసులు పట్టుకోవడానికి వస్తే తప్పించుకుని పారిపోబోయారు. అప్పటిదాకా సరదాగా కబుర్లు చెప్పిన హీరో పాత ప్రెండు తను మాప్టీ లో ఉన్న పోలీసునని చెప్పి ఆరెస్ట్ చేయబోయాడు.
సెక్రటరీ వెంటనే ఓ చెత్తబుట్ట అతని నెత్తి మీద కుమ్మరించి హీరోని,యజమానిని రక్షించింది.ఈ త్యాగానికి మురిసిపోయాడు డబ్బున్నాయన.కార్లో తిరిగి వచ్చేటప్పుడు హీరోకి నచ్చ చెప్పాడు. “ ఆ గళ్ ఫ్రెండుని వదిలేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో.ఆమె ప్రేమించేది నిన్నేట."అని.
అప్పుడు ఆ అమ్మాయి కారు వెనకసీట్లో నిద్రపోతోంది.
“ ఇవాళ నువ్వు ఆమెతో డాన్సు చేస్తుంటే నాకూ అదే అనిపించింది.కానీ ఆ గళ్ ఫ్రెండుతో నాకు ఎంగేజ్ మెంట్ అయిపొయింది.మాట తప్పడం మా వంశంలో లేదు.ఆమె అంతట ఆమె తెగతెంపులు చేసుకుంటే తప్పా నేను ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేయను " అన్నాడు హీరో.
సవతి కూతురికి ఓ జ్యూవెలర్ తో పరిచయం అయింది.అతని సలహా మేరకు ఇంట్లో ఉన్న ముత్యాలహారం మిగతా నగలు తక్షణం బ్యాంకులో పెట్టించేయమని తల్లికి ఫోన్ చేసింది.
ఆవిడ డిటెక్టివ్ ని పిలిచి రేపు బ్యాంకులో ఇవన్నీ పెట్టేసిరా అని చెప్పింది. డిటెక్టివ్ పొంగిపోయాడు.హాయిగా విజిల్ వేసుకుంటూ తిరుగుతుంటే టక్కరిజంటలో భార్య కనబడి ఏమిటి సంగతి అంది.
హుషారులో చెప్పేశాడు. " నేను కష్టపడినక్కర లేకుండా అవి నా చేతికే వస్తున్నాయి పట్టుకుని ఉడాయిస్తా " అని .
“ అలాగా !? అయితే ఇప్పుదే వెళ్లి ఆవిడకి చెప్పేస్తా.నువ్వు నన్ను ఎక్స్ పోజ్ చేసినా పరువాలేదు.నీకు మాత్రం దక్కనివ్వను " అంది.
“ అయితే ఏం చేయమంటావ్ " అన్నాడు డిటెక్టివ్ వెర్రి మొహం వేసి.
“ జ్వరం వచ్చిందని చెప్పు.నగలు ఇంట్లోనే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మరో ఛాన్సు రాకపోదు " అంది ఆమె. ఆ ప్రకారమే డిటెక్టివ్ జ్వరం అని చెప్పేసాడు.
దాంతో ఇక గతిలేక హీరోని పిలిచి " నువ్వే బ్యాంకు కి వెళ్ళు " అని చెప్పింది డబ్బున్నావిడ.
వెంటనే యజమాని వద్దకు వెళ్లాడు హీరో.
విషయం చెప్పాడు.ఎగిరి గంతేశాడు డబ్బున్నాయన.ఒప్పుకో అని బలవంత పెట్టాడు.ఎందుకని అడిగితే చెప్పుకొచ్చాడు.
" చేతిలో డబ్బు ఆడక కటకటపడి భార్య నగల మీద కన్నీశాడాయన.మెరుగు పెట్టిస్తానని చెప్పి పట్టుకెళ్ళి డూప్లికేటు నగలు యిచ్చి అసలువి ఆమెసుకుని ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు బ్యాంకుకు వెళితే అసలు సంగతి బయట పడుతుంది.
లేకపోయినా రేపు పెళ్లి అయ్యాక కాబోయే అల్లుడు జ్యావేలరీ కాబట్టి పసిగట్టేస్తాడు.అందుకని హీరోయే వాటిని పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళి ఈయనకు ఇచ్చేయాలి.ఆవిడ అడిగితే దొంగలు వచ్చి కొట్టి పట్టుకెళ్ళి పోయారని చెప్పాలి.” అని.
ఇదంతా విని " దీనిలో నాకేం లాభం అనుమానించి ప్లీసు రిపోర్టు ఇస్తే నేను జైలుకి వెళ్ళాలి " అన్నాడు హీరో.
“ మరి మంచిది.ఓసారి జైల్లో పడ్డావని తెలిస్తే నీ గళ్ ఫ్రెండు నాన్న మండిపడతాడు.నీలాంటి మర్యాద హీనుడితో సంబంధం తెంపుకొమని కూతురికి చెప్తాడు.ఆమె అంతట ఆమె ఎంగేజ్ మెంటు బ్రేకు చేసేస్తుంది.నీ ప్రతిజ్ఞకు భంగం వాటిల్లకుండా నువ్వు బయటపడవచ్చు.సెక్రటరీని పెళ్లాడవచ్చు" అన్నాడు డబ్బున్నాయన.
“ సరే " అన్నాడు హీరో.
కానీ ఆ ప్లానుకి అవాంతరం వచ్చింది టక్కరి జంటలోని భార్య వల్ల. హీరో నగలు తీసుకుని బ్యాంకుకు వెళుతుండగా ఆమె దారిలో కనబడి లిప్టు అడిగింది. సరేనని ఇచ్చేదాకా వుండి కాసేపటికి పిస్తోలు తీసి " నగలు మర్యాదగా అప్పగించమని " అంది.
కానీ ఆమె సంతోషం కొద్దిసేపు కూడా నిలవలేదు. డిటెక్టివ్ వచ్చి ఆమెను బెదిరించి నగలు తీసుకుని పారిపోయాడు.ఆమె గోల్లుమంటే హీరో ఓదార్చాడు.
“ అవి నకిలివి.నువ్వేం బాధపడకు " అని.
ఈలోపుల గళ్ ఫ్రెండు తండ్రి ఫోన్ చేసి హీరో గురించి డబ్బున్నావిడను హెచ్చరించడంలో హీరో కథ ఆవిడ నమ్మకపోవడం హీరో అవి నకిలివి అన్న విషయం చెప్పడం జరిగింది.
విషయం బయటపడిపోవడంతో అనేక పరిణామాలు జరిగేయి. మొగుడు చేసిన మోసం విని డబ్బున్నావిడ విడాకులు ఇచ్చిపారేసింది.పీడా పోయింది. హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడాయన.
గళ్ ప్రెండు తండ్రి కూతుర్ని ఓ పోలీసాఫీసరుకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. గళ్ ఫ్రెండు తనకు తానే ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేయడంతో హమ్మయ్య అనుకుని హీరో, సెక్రటరీని పెళ్లి చేసుకున్నాడు.
|