Pamulavadu

"పాములవాడు "

యస్. యస్. కృష్ణ 

సినిమా రసవత్తరంగా నడుస్తోంది.

ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా గుడ్లప్పగించి చూస్తున్నారు.

కాసేపటికే అందరిలో కలకలం.

ఒక్కొక్కళ్ళూ అబ్బా, అయ్యా అనడం మొదలుపెట్టారు.

కుయ్యో, మొర్రో అంటూ కదుల్తున్నారు.

మరి కాసేపటికి సినిమాను మించిన సౌండు మొదలైంది.

కలవరం కాస్తా అలజడిగా మారింది.

“ఎహే, సినిమా ఆపండి, ఏంటీ ఎలుకల గోల? ఇదసలు సినిమా హాలా లేక ఎలుకల సొరంగమా?” అంటూ అరిచాడు ఒక పెద్ద మనిషి.

“ అవును...ఏమిటీ గోల? ముందుగా దీనిని ఆపండి.” అంటూ కోపంగా లేచాడు మరొక పెద్ద మనిషి.

“ మమ్మీ...” ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు.

“ నా చెవులు పగిలిపోతున్నాయి బాబోయ్ " అని ఆవిడ పెద్దగా అరుస్తూ,చెవులని మూసుకుంది.

ఇలా సినిమా చూస్తున్న వాళ్ళందరూ లేచి అరుపులు సాగించడంతో థియేటర్ మేనేజర్ రంగప్రవేశం చేశాడు.

“ఏంటండీ, ఇది సినిమా హాలేనా? ఈ వరసన ఎలుకలు దాడి చేస్తుంటే సినిమా ఎలా చూడాలి?”

“కాసేపు, ఓపిక పట్టండి, కబురు పంపించాను, అతనొచ్చేస్తాడు”

“ఎవరు?”

“పాములవాడు.. ఓ పది పాములు తెచ్చి పడేశాడంటే ఎలుకలన్నీ మాయమౌతాయి..”

" ఆఁ..” అంటూ అందరూ నోర్లు తెరిచారు.