TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
"క్షణక్షణముల్...”
విద్యావతి
భార్యాభర్తల మధ్య పెద్ద జగడం జరిగింది.
భార్య అలిగి,హాల్లోని డబుల్ సోఫాలో ఒక మూల,ఏదో పుస్తకం చదువుతున్నట్టు నటిస్తూ కూచుంది.
భర్త కూడా చాలాసేపు మాట్లాడకుండా , పైన వాళ్ళ బెడ్ రూమ్ లోని బెడ్ పై కూచున్నాడు.
బాగా ఆలోచిస్తూ, తలని అటూ ఇటూ ఊపుతూ,ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తలని నిలువుగా నెమ్మదిగా ఊపుకుని,బెడ్ మీది నుండి లేచి చివరికి దిగివచ్చాడు.
భార్య, చూసిన చూడనట్టుగా...పుస్తకం చదువుతున్నట్టు నటిస్తూ వుంది.
గొంతు సవరించుకుని " చూడు శాంతా...” అన్నాడు.
పుస్తకం చదువుతున్నట్టు నటిస్తున్న శాంతా,పుస్తకాన్ని పక్కకు పెట్టి "చూశాను చెప్పండి " అంటూ భర్తను చూసింది భార్య.
“ మనిద్దరి మధ్య జరిగిన వాదోపవాదాల గురించి నేను బాగా ఆలోచించాను...” అని ఆగాడు.
“ అయితే ఏమిటన్నట్టు "
భర్త పెదాలు తడుపుకుని " అదే..ఆలోచించి చూస్తే...నువ్వు చెప్పినదాంట్లోనూ సబబున్నట్టుంది.” అన్నాడు.
“ అదే కదా నేను అప్పటి నుండి చెప్పేది "
“ నేను నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను " అన్నాడు.
అలా అని లోపల మాత్రం 'హమ్మయ్య 'అనుకున్నాడు. కానీ భార్య మొహం మీద వెలుగు రాలేదు.
“ అదేం లాభం లేదు.ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను " అని హుంకరించింది.
“ ఛ..ఈ ఆడవాళ్ళు ఏ క్షణంలో ఎలా వుంటారో ఎవరికీ అర్థం కాదు.అప్పుడే ఏడుస్తారు. అప్పుడే నవ్వుతారు.అప్పుడే తిడుతారు.అప్పుడే కొడుతారు.అప్పుడే మెచ్చుకుంటారు.అప్పుడే దగ్గరికి తీసుకుంటారు.వీళ్ళని ఎవరు మార్చులేరు.” లోలోపల అనుకుంటూ అలా బయటికి వెళ్ళిపోయాడు భర్త.
|