Vimanam lo Devudu

" విమానంలో దేవుడు "

ఎన్.నాగమణి

మొదటిసారిగా విమాన ప్రయాణం చేస్తున్న సింగన్న " భగవంతుడా...నన్ను క్షేమంగా కిందికి చేర్చావంటే నా దగ్గర వున్నడబ్బులో సగం నీకు యిచ్చుకుంటాను " అంటూ దేవుణ్ణి ప్రార్థించాడు గట్టిగా.

వెనక సీట్లో కూర్చున్న అప్పన్న, సింగన్న దేవుడిని ప్రార్థించినది విని...మతబోధకుడిలా, విమానం కిందికి దిగగానే...

" భక్తా... నేను నీ మొర ఆలకించి ఇలా మనిషి రూపం లో నీ దగ్గరికి వచ్చాను. నీ వద్ద వున్న ధనంలో సగభాగం నువ్వు చెప్పిన ప్రకారం యిచ్చావంటే నాకు నేనే గుడిని కట్టించుకుంటాను.” అతి తెలివిగా అన్నాడు.

“ అరెరే...విమానం కిందకి దిగగానే నేను దేవుడిని మళ్ళీ ప్రార్థించి ఈసారి యింకా ఘనంగా మొక్కున్నానండీ...ఇలానే ఎప్పుడైనా నన్ను మళ్ళీ విమానంలో కలుసుకోవటం జరిగితే అప్పుడు మొత్తం నా ఆస్థి అంతా రాసి యిచ్చేస్తానని...” అని తెలివిగా బదులు చెప్పాడు సింగన్న.

(హాసం సౌజన్యంతో )