TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
" మద్యమా? మగువా ? ”
విద్యావతి
కాస్త హై క్లాసు పార్టీ జరుగుతుంది.
డ్రింకులు యివ్వడానికి ఓ అందమైన అమ్మాయిని పెట్టారు.ఆమె హుషారుగా తిరుగుతూ ఆడా,మగా అందర్నీ మొహమాటపెట్టి మరీ డ్రింకులు ఇస్తోంది.
మధ్య వయస్సులో ఉన్నవాళ్ళు కూడా ఆమె కులుకు,హొయలు చూసి డ్రింకు వద్దనలేకుండా ఉన్నారు.
రాత్రి పొద్దు పోయింది.భోజనాలకు కదులుతున్నారు చాలామంది. ఆ పార్టీ ఇస్తున్నాయన వద్దకు 40యేళ్ళ వయసున్న ఒకావిడ వచ్చింది.
“ ఎక్స్యూజిమి...డ్రింకులిచ్చే అమ్మాయి ఎక్కడ ?” అని అడిగింది.
ఆయన ఆశ్చర్యపడ్డాడు.
ఆవిడ సాధారణంగా డ్రింకు తీసుకోదని ఆయనకు తెలుసు. " ఈ గడుగ్గాయి అమ్మాయి ఈవిడ చేత కూడా మందు ముట్టించిదన్న మాట" అనుకుని ఆశ్చర్యపడుతూ " భోజనాల వేళ కావడంతో డ్రింకులు సర్వ్ చేయడం అపేసినట్టుంది. అయినా వర్రీ కాకండి.మీ సీట్లో కూచోండి.డ్రింకు నేను పంపిస్తాను " అని ఆవిడకి హామీ ఇచ్చాడు.
ఆవిడకు ఒళ్ళు మండింది.
“ నాకు కావలసినది డ్రింకు కాదు, మా ఆయన !” అంది పళ్ళు గిట్టకరిచి.
|