Navvule-Navvulu-2

నవ్వులే నవ్వులు - 2

“ మీరే ఆలోచించండి "

“నా ఎదురు బెర్త్ లో కూర్చున్న కుర్రాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు.” అంటూ రైల్వే పోలీసులకి కంప్లయింట్ ఇచ్చింది ఓ టీనేజ్ అమ్మాయి.

రైల్వే పోలీస్ ఆమె వెంట వెళ్ళి, ఆమె చూపిన కుర్రాడి భుజం మీద చెయ్యేసి, “ఏమిటి సంగతి " అని గద్దించి అడిగాడు.

ఆ కుర్రాడు వింతగా చూస్తూ.. “నేనసలు ఆమె వంకే చూడలేదు.” అన్నాడు.

“నిజం ఒప్పుకున్నాడు పోలీస్ మాన్! నావంక కన్నెత్తి అయినా చూడకపోతే ఏమనుకోవాలి? మూతి తిప్పుతూ అందామె.

“ విడాకులు "

“నిన్ననే పెళ్ళిచేసుకుని ఇవాళ విడాకులు కావాలని ఎందుకు అడుగుతున్నావు?” అడిగాడు జడ్జి.

“నిజమే, నిన్నే పెళ్ళి జరిగింది.. కానీ రాత్రి నా మనసుకు గాయమయ్యే సంఘటన జరిగింది..”

“ఎంటో అది?”

“వంటచేయడం వచ్చా అంటే రాదని చెప్పాను... ఆమాత్రానికి.. నేనేదో ఖూనీ చేసోచ్చినట్టు ఈయనగారు మహా ఆశ్చర్యంగా ముఖం పెట్టాలటండీ...?!” ఆవేశపడుతూ అడిగింది ఆ అమ్మాయి.

లిప్ స్టిక్

“మొన్నటిదాక 'పప్పా' అని పిలిచి, నిన్నటి నుంచి 'డాడీ ' అని పిలుస్తున్నావేమిటి ?” అడిగాడు తండ్రి.

“'పప్పా' అని పిలుస్తుంటే లిప్ స్టిక్ పోతున్నది డాడీ ! " అని చెప్పింది కూతురు.

వైఫ్ మర్డర్

“ మీ భార్య తొందర్లో మర్డర్ చేయబడుతుంది " చెప్పాడు జ్యోతిష్కుడు.

“ఆ సంగతి నాకు తెలుసండీ.కానీ నేను పట్టుబడకుండా వుంటానా...లేదా...అనే విషయం చెప్పండి " అని నాలిక్కరుచుకున్నాడు అతడు.

" తెలివైన డాక్టర్ "

ఒకావిడ డాక్టర్ దగ్గరికి వెళ్లి " డాక్టర్ గారు...నేను గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను " అని మొదలు పెట్టి ఆవిడ కష్టాలన్నీ చెప్పేస్తుంటే,

వెంటనే డాక్టర్ గారు " ఏదీ, ఒకసారి నోరు తెరవండి " అన్నాడట.

దాంతో ఆవిడ నోరు తెరిచింది. అయినా డాక్టర్ గారు, తెరిచినా ఆమె నోరుని గమనించకుండానే గబగబా మందులు రాసిచ్చాడు.

“ అయ్యో ! మీరు నా నాలిక చూడనేలేదుగదండీ " అవి ఆవిడ అనగానే వెంటనే డాక్టర్ "అక్కర్లేదమ్మా. మీరు కాసేపు మాట్లాడకుండా వుండాలనే నోరు తెరిపించాను " అని అన్నాడంట.

 

“ యాభై రూపాయల జీతగాడు "

కొద్ది రోజులుగా ఒక బట్టలషాపు ముందు...జుట్టు గడ్డం పెరిగి,మాసిన బట్టల్లో అసహ్యంగా వున్నాఓ అనాకారి, పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకుంటూ నిల్చోవడం వల్ల ఆ షాపుకి కస్టమర్ల రాక తగ్గిపోయింది.

ఏం చేయాలో అర్థం కాక,ఆ షాప్ యజమాని తప్పని పరిస్థితిలో వాడి దగ్గరికి వెళ్ళి " చూడయ్యా...నువ్వో పనిచెయ్.ఆ కార్నర్ షాపు ముందేళ్ళి పాడుకుంటూ నిల్చో.రోజుకో యిరవై రూపాయలు ఇస్తాను. సరేనా !” అన్నదంటా.

అందుకు ఆ పిచ్చివాడు " చాల్లెండి సార్.ఆ షాప్ వాళ్ళే రోజుకో యాబై రుపాయలిస్తూ యీ షాప్ ముందు నిల్చోపెట్టారు " అని చెప్పడంటా.

అంతే...నోటిమాట పడిపోయింది ఆ షాపు యజమానికి.