Papam Subba Rao

" పాపం...సుబ్రావ్ "

-గోపి

పాపం, సుబ్బారావు ఎప్పుడూ ఫ్రెండ్సు జోకులకి బలయిపోతూ ఉంటాడు.

ఓ రోజు ఓ ప్రెండు వచ్చి " సుబ్రావ్!నేనో ప్రశ్న అడుగుతాను కరెక్టుగా సమాధానం చెప్పాలి మరి" అన్నాడు.

సుబ్బారావు కీడు శంకిస్తూనే "అడుగు "అన్నాడు.

“పొద్దునే ఖాళీ కడుపుతో నువ్వు ఎన్ని ఇడ్లీలు తినగలవు.”

“ఓస్,ఇంతేనా " అనుకుని "పది ఇడ్లీలు ఈజీగా లాగించేస్తా "అన్నాడు సుబ్బారావు గొప్పగా.

ప్రెండు ఎగతాళిగా నవ్వేడు.

“అందుకే నిన్ను సుబ్బారావు అంటారు.మొదటి ఇడ్లీ తిన్నాక అది ఖాళీ కడుపు ఎలా అవుతుందోయ్ పిచ్చి మొహమా ? ” అని గేలి చేశాడు.

సుబ్బారావు మనసులో ఎద్చుకున్నా జోక్ కి ఎంజాయ్ చేశాడు. ఈ జోక్ ని తన భార్య మీద ప్రయోగించి ఆమెని ఆట పట్టిద్దామని ఇంటికెళ్ళాడు.

సుబ్బారావు భార్య వంట పనిలో తల మునకలుగా ఉంది. సుబ్బారావు హుషారుగా ఫ్రెండు తనని అడిగిన ప్రశ్నని ఆమెని అడిగాడు.

సుబ్బారావు భార్య బిజీగా ఉండి అతడిని పట్టించుకోలేదు.

" ఖాళీ కడుపుతో ఎన్ని ఇడ్లీలు తినగలవు? ”అంటూ సుబ్బారావు ఆమెని వేధించసాగాడు.

సుబ్బారావు భార్య గట్టిగా కసురుకుని " ముప్పయి తింటాను సరేనా " అని అరిచింది.

పాపం,సుబ్బారావు నీరుగారి పోయాడు.

“నువ్వు పది ఇడ్లీ అని చెప్పి వుంటే నీకో మంచి జోక్ చెప్పి ఉండేవాణ్ణి తెల్సా ! ” అని బిక్క మొహం వేశాడు.