Lion of Village

గ్రామ సింహం

జెమినిలో ' వన్స్ మోర్ ప్లీజ్ ' షూటింగ్ కి టైమవుతుంది.

ఉదయభాను ఇంకా రాలేదేమో అని పికప్ చేసినట్టు కూడా ఉంటుందని ఆమె ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు జూనియర్ వేణు మాధవ్.

తలుపు చప్పుడైంది.

“ ఎవరూ ? ”

“ నేను, సమరసింహారెడ్డిని " అన్నాడు బాలకృష్ణ వాయిస్ తో.

“ మీ తండ్రి పేరు ? ”

“ సర్దార్ పాపారాయుడు " అన్నాడు కృష్ణంరాజు రేంజ్ లో.

“ తాతపేరు ? ”

“ బొబ్బిలి బ్రహ్మన్న "

“ తల్లిపేరు "

" కడప రెడ్డమ్మ " అన్నాడు శారద మాడ్యులేషన్ లో.

“ సరే... లోపలికి రా ! ”

“ వద్దును గానీ, గుమ్మం దగ్గర కుక్క ఉంది. కాస్త కట్టేయ్యండి.” అన్నాడు వేణుమాధవ్ తన ఒరిజినల్ టోన్ లో.

(హాసం సౌజన్యంతో )