Adi Katha

' ఆది ' కథ

-తాజీప్రసాద్

భగవంతుడు ఆడమ్, ఈవ్ లని సృష్టించి ఈ సృష్టిలో విశిష్ట సృష్టికి శ్రీకారం చుట్టాడు.

గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఈవ్ సరసన వున్నా ఆడమ్ ని ఒక సందేహం తీరక వేధిస్తోంది. సృష్టి కర్తనే అడిగి ఆ సందేహం తీర్చుకుందామనుకున్నాడు ఆడమ్.

ఒకరోజు తను ఒంటరిగా వున్న సమయంలో ఆకాశం వైపు చూస్తూ " హే భగవాన్ " అంటూ ప్రార్థించాడు.

“ ఏమిటి ఆడమ్ ?” అంటూ భగవంతుడి వాణి వినిపించింది.

“ భగవాన్ నన్ను ఒక సందేహం ఈవ్ కన్నా ఎక్కువగా అంటిపెట్టుకుని వుంది " అన్నాడు ఆడమ్.

“ చెప్పు " భగవంతుడు ధైర్యం చెప్పాడు.

“ భగవాన్, మీరు ఈవ్ ని ఎందుకు అంత అందంగా సృష్టించారు.? ” అని తన సందేహాన్ని వెల్లడించాడు ఆడమ్.

“ అదా నీ సందేహం. ఆమె ప్రేమలో నువ్వు పడడానికి " భగవంతుడు చెప్పాడు.

“ అది సరే భగవాన్. మరి ఈవ్ ని అంత మూర్ఖురాలిగా ఎందుకు సృష్టించారు " అని వెంటనే అడిగాడు ఆడమ్.

“ అమాయకుడా అందకూ కారణం వుంది.ఈవ్ నీ ప్రేమలో పడడానికి " అంటూ కనిపించని భగవంతుని వాణి వినిపించకుండా ఆగిపోయింది.