Naa Modati Bharya

Naa Modati Bharya

ఒక దొంగ అర్థరాత్రి గుర్నాథం ఇంట్లో దూరాడు.

భార్యాభర్తలను బెదిరించి, స్థంభానికి కట్టేసి, బీరువాలోని నగలు, డబ్బులు అన్నింటీనీ

మూటకట్టుకుని వాటి లిస్టు తయారు చేశాడు.

“ ఈ కాగితంలో మీరిద్దరూ సంతకం పెట్టండి " అన్నాడు ఆ దొంగ వారికి కాగితాన్ని,

పెన్నును అందిస్తూ.

“ ఏ..ఏ...ఎందుకు ?” భయపడుతూ అడిగారు గుర్నాథం దంపతులు.

“ వీటిల్లో నేనేదైనా నా రెండో భార్యకు యిచ్చేశానని నా మొదటి భార్య అనుమానిస్తుంది

కాబట్టి" అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు ఆ దొంగ.

"ఆ..." అని గుర్నాథం దంపతులిద్దరూ ఆశ్చర్యంగా నోరు తెరిచారు.