Navvule Navvulu 18

Navvule Navvulu 18

***************************

Shobhaneshwar Dookudu

“డూప్ లేకుండా ఏ సీనులో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతారు?”నటుడు శోభనేశ్వర్

ని అడిగాడు విలేఖరి.

“శోభనం సీనులు "అని చెప్పి ఠక్కున నాలిక్కరుచుకున్నాడు.

***************************

Aa Okkati Adakku

“ఏవండీ...షాపింగ్ కి తోడుగా వస్తారా?”అడిగింది భార్య.

అదిరిపడిన భర్త" ఆ ఒక్కటీ అడక్కు "అని ఇంట్లో నుండి పారిపోయాడు.

********************

Paaripovadaaniki

“పెళ్ళిలో పెళ్ళికొడుకుని గుఱ్ఱం ఎందుకు ఎక్కిస్తారురా ?”అడిగాడు ఆనంద్ అమాయకంగా.

“పారిపోవడానికి చివరవకాశం ఇస్తున్నామని చెప్పడానికి "అని పకపక నవ్వాడు గోవింద్.

******************

Podupu Cheyadam

“పొదుపు చేయడం ఎలా?అనే పుస్తకం రాసి అచ్చేయించా.నువ్వో కాపీ కొని చదవర ప్రసాద్

" ప్రసాదుతో అన్నాడు శేఖర్ .

“కొనడం ఎందుకురా.ఓసారివ్వు...చదివిస్తా...అదే కదా పొదుపు చేయడం "తెలివిగా

అన్నాడు ప్రసాద్.

అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు శేఖర్.

*************************

Missing Donkey

ఓ గాడిద ఓ ఇంటి ముందు నిలబడి ఉంటే,అదే రూట్లో వెళ్తున్నమరో గాడిద ఆగి అడిగింది"

ఏంటి ఇక్కడ నించున్నావ్?”అని.

“మా అబ్బాయి నిన్నట్నుంచీ కనబడడం లేదు గురూ.!ఈ ఇంట్లోంచి నువ్వు

గాడిదకొడుకువంటే నువ్వే గాడిద కొడుకువని మాటలు

వినబడుతున్నాయి.బయటికి వస్తే మావాడెవడో గుర్తు పట్టి తీసుకెళ్దామని వెయిట్

చేస్తున్నాను "అని చెప్పింది రెండో గాడిద.

******************

Tamasha doctor

“డాక్టర్ గారూ!మా అబ్బాయి రూపాయి నాణెం మింగేశాడు.నాకు భయంగా వుంది.వెంటనే

వైద్యం చేయండి ప్లీజ్ "బతిమాలింపుగా అన్నాడు మంత్రి.

“ఏం కాదండీ.కోట్లు మింగిన మీరే దుక్కలా వున్నారు.రూపాయి మింగిన

మీవాడికేమవుతుంది " అని గబుక్కున

నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.