Maa Aavida Prema

మా ఆవిడ ప్రేమ

" రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ

ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడుతుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్ కూడా

వేస్తుంది తెలుసా నీకు " అని గొప్పగా తన భార్య గురించి చెప్పాడు కిశోర్.

"అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేముందిరా " అని నోరు తెరిచాడు నరేందర్.

" ప్రేమ కాదు దోమ కాదు. మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా అందుకే " అని

గబుక్కున నాలిక్కరుచుకున్నాడు కిశోర్.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు నరేందర్.