Telivaina Chitti

Telivaina Chitti

 

చిట్టి వాళ్ళ నాన్న చిట్టితో " చూడు చిట్టీ...ఎవరైనా మనింటికి వచ్చి సరదాగా

నిన్ను ఏమైనా అడిగితే తియ్యతియ్యగా సమాధానాలు చెప్పాలి " అని చెప్పాడు.

" అలాగే నాన్న " అని బుద్ధిగా తలూపుంది చిట్టి.

కాసేపటికి చిట్టి వాళ్ళ అంకుల్ చిట్టి ఇంటికి వచ్చాడు.

" చూడు పాపా నీపెరేమిటి ?" అని చిట్టిని అడిగాడు.

" పాలకోవా " అని చెప్పింది చిట్టి.

" గుడ్.... మీ అమ్మ పేరు " అని అడిగాడు ఆ అంకుల్.

" మైసుర్ పాక్...." అని చెప్పింది చిట్టి.

" మీ నాన్న పేరు..." అని అడిగాడు ఆ అంకుల్.

" కాజా..." అని చెప్పింది చిట్టి.

" మీ చెల్లాయి పేరు ?" అని అడిగాడు ఆ అంకుల్.

" లడ్డు..." అని చెప్పింది చిట్టి.

" మీరెక్కడ ఉంటున్నారు ?" అని అడిగాడు ఆ అంకుల్.

" మిఠాయి డబ్బాలో...." అని తియ్యతియ్యగా సమాధానాలు చెప్పింది చిట్టి.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ అంకుల్.