TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
“ నాన్నగారు " అని పిలిచాడు అప్పుడే వచ్చిన తండ్రి దగ్గరికి వచ్చిన కొడుకు.
“ ఏమిట్రా ?” అని ప్రేమగా అన్నాడు తండ్రి ఆ కొడుకుని దగ్గరికి తీసుకుంటూ.
“ గేదెను చూస్తే మీకు భయమా ?”
“ లేదు "
“ రాత్రిపూట గబాల్న దెయ్యం వస్తే "
“ అప్పుడు కూడా భయపడను. అయినా ఎందుకిలా అడుగుతున్నావురా ?” అని
మరింత ప్రేమగా అడిగాడు తండ్రి.
“ అమ్మకి తప్పా మరెవరికైనా భయపడతారో లేదో తెలుసుకుందామని " అని
పకపక నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ కొడుకు.
“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ తండ్రి.
|