ఓస్, అంతేనా?!
“తుఫాను బాధితుల సహాయార్థం మేము ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చాము!” గొప్పగా చెప్పుకున్నాడు హరీష్. “ఓస్, అంతేనా? మేము ఒకరోజు సంపాదించే లంచాన్నే విరాళంగా ఇచ్చాం. తెలుసా?” కళ్ళు ఎగరేస్తూ మరీ గొప్పగా చెప్పాడు సీతారాం.