Namminchi Mosam Cheyadam

డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు హరి. లోపలికి

ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే "దయచేసి పేల్చడమో,

కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్

తిప్పండి చాలు" అని రాసుండటంతో ఆ పని చేశాడు.

వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది.

దాంతో పోలిసులకు దొరికిపోయాడు. వ్యాన్‍లో తీసుకెళ్తుంటే

"హు.... ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం

చేయడం మామూలైపోయింది" అనుకున్నాడు విచారంగా.