Meeru Kuda Pothe

“ అందరికి నమస్కారం ! నా కుడి పక్కనున్న సర్పంచ్ గారు

పొతే...పార్టీ పెద్దలు పరంధామయ్య గారు పొతే...హెడ్ మాస్టర్

గోపాలరావు గారు పొతే...మేడమ్ పార్వతమ్మ గారు పొతే...” అని

ఒక సభలో ఒక పెద్ద మనిషి ఉపన్యాసం యిస్తున్నాడు.

ఈ పొతే...పొతే...అనే పదం వినీ వినీ అసహనంగా లేచిన ఒక వ్యక్తీ

" అయ్యా !పొతే...పొతే.. అంటూ అందరిని పంపించి, వారితో పాటు

మీరు పొతే...మేం కాస్త ఊపిరి పీల్చుకుంటాము " అంటూ

అరిచాడు.