ఉల్లాసంగా ఉత్సాహంగా స్పెషల్ జోక్స్

ఉల్లాసంగా ఉత్సాహంగా స్పెషల్ జోక్స్

లంచగొండితనం మీద అనర్గళంగా చర్చ సాగుతోంది.

“ఇంతకీ, లంచగొండితనాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి?” అడిగాడో వ్యక్తి.

“ముందు దానిని చట్టబద్దం చేయాలి!” తాపీగా చెప్పాడు రెండో వ్యక్తి.

***

“మా స్టెనో గ్రాఫర్ సామాన్యురాలు కాదు, రాజకీయ నాయకులను మించిన తెలివితేటలు

ఉన్నాయి ఆవిడకి!” అన్నాడు గోవింద్.

“ఏమయింది? ఎందుకలా అంటున్నావు?” అడిగాడు సురేంద్ర.

“ఆఖరికి షార్ట్ హాండ్ మిషన్ రిపేర్ అంటూ బిల్లు పెట్టి డబ్బులు దండుకుంది!” చెప్పాడు

గోవింద్ అది విని అవాక్కయ్యాడు సురేంద్ర.

***

“రేయ్...నేనీమధ్య ఓ అమ్మాయికి కన్ను గీటా" చిలిపిగా చెప్పాడు గుర్నాధం.

“ఊరుకుందా మరి" ఆశ్చర్యంగా అడిగాడు చితంబరం.

“అస్సలేం అనలేదురా' 'సిగ్గు పడుతూ చెప్పాడు.

“ఆశ్చర్యంగా వుందే" అన్నాడు చితంబరం.

“ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముందిరా...నేను కన్ను గీటిన సమయంలో అంతా కటిక

చీకటి కదా" అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు గుర్నాధం.