తెలుగు టీ.వి. కార్యక్రమాలు చూడలేక

తెలుగు టీ.వి. కార్యక్రమాలు చూడలేక

కరెంట్ రాకముందు సరదాగా కబుర్లు చెప్పుతూ పెళ్ళినాటి సంగతులు మాట్లాడుతూ సినిమాల గురించి విశ్లేషణ చేస్తూ ఎంతో సందడి చేసిన భర్త, కరెంట్ రాగానే ఆలస్యం చేయకుండా గబగబా బెడ్ రూములోకి వెళ్లాడు.
కరెంట్ వచ్చిందని భార్య టీవీ ఆన్ చేసి సీరియల్స్ చూస్తుంది.
చాలాసేపటి నుండి భర్తను పిలుస్తుంది బయటికి రమ్మని. కాని ఆ భర్త హాల్లోకి రాకుండా బెడ్ రూములోనే ఉండిపోయాడు. రమ్మంటే రాను అని లోపలి నుండే సమాధానం చెబుతున్నాడు.
బెడ్ రూములోకి వెళ్ళిన తన భర్త పిలిచినా బయటికి రాకుండా ఏం చేస్తున్నాడో చూడాలనిపించింది ఆ భార్యకు. వెంటనే లేచి బెడ్ రూము దగ్గరికి వెళ్లి డోర్ మీద దబదబా బాదింది. ఏమయిందని కంగారు పడిన ఆ భర్త డోర్ తెరిచాడు.
భార్య లోపలికి వెళ్లి చూసింది.
భర్త తాగడానికి తాయారు చేసుకున్న మందు కనబడింది.
భార్య : ఎందుకండీ తాగుతున్నారు ? ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా !
భర్త : కరెంట్ వచ్చింది కదా..ఇప్పుడు తెలుగు టీ.వి. కార్యక్రమాలు వస్తాయి.. వాటిని చూసి తట్టుకోటానికి తాగుతున్నాను.
భార్య : ఆ...