అమెరికన్ టూరిస్ట్ జోక్

Americans Tourism

అమెరికన్ టూరిస్ట్ జోక్

ఓ అమెరికన్ టూరిస్ట్ కోనసీమకి వచ్చాడు. ఒక గ్రామానికి చేరుకున్నాడు.

అక్కడ ఒక షాపులో కొబ్బరి బొండాలు కనబడ్డాయి.

" మంచి వాటర్ ఉన్న ఒక కొబ్బరి బొండాన్ని కొట్టివ్వు " అన్నాడు టూరిస్ట్.

" అలాగే సర్ " అని ఒక కొబ్బరి బొండం కొట్టించాడు ఆ షాపు అతను.

టూరిస్ట్ ఆ కొబ్బరి బొండాన్ని తాగి " రేటెంత ? " అని అడిగాడు.

" రెండొందలు " అని చెప్పాడు ఆ షాపు అతను.

" వాట్....ఒక్క కొబ్బరి బొండాం రెండొందలా..? అంతరేటేమిటి ? పైగా ఇక్కడ

కొబ్బరిబొండాలు ఎక్కువే దొరుకుతాయనుకుంటాను " అని ఆశ్చర్యం, రవ్వంత కోపంతో

అన్నాడు ఆ అమెరికన్ టూరిస్ట్.

" ఔనండీ...కొబ్బరిబొండాలు ఎక్కువగానే దొరుకుతాయి. కాని అమెరికన్ టూరిస్టులు

ఎప్పుడోకాని దొరకరు కదా " అని చెప్పి పకపక నవ్వాడు ఆ షాపు అతను.

అయోమయంగా చూస్తుండిపోయాడు ఆ అమెరికన్ టూరిస్ట్.