Roju Vidichi Roju Aadutaale

Roju Vidichi Roju Aadutaale

రోజు విడిచి రోజు ఆడుతాలే

తన కొడుకు స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరగడమే కాక పేకాట కూడా

ఆడుతున్నాడని తెలిసిన తండ్రి , తన కొడుకుని దగ్గర కూర్చోపెట్టుకొని హీతబోధ చేశాడు.

" చూడు బాబూ...పేకాట ఆడటం చాలా తప్పు. దాని వల్ల ఈ రోజు డబ్బు వస్తుంది. రేపు

పోతుంది. ఎల్లుండి వస్తుంది. ఆవలి ఎల్లుండి పోతుంది " అని చెప్పాడు.

" అలాగా నాన్నా....! అయితే ఇకపైన రోజు విడిచి రోజు ఆడిగెలుస్తానులే " అంటూ

వెళ్ళిపోయాడు ఆ కొడుకు.