ఆశ పడిన పెళ్ళికొడుకు

ఆశ పడిన పెళ్ళికొడుకు

మంచి రోజని సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయిలకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు.

పెళ్ళికొడుకు సుబ్బారావు ఇంటికి వచ్చాడు.

పెళ్లి కొడుక్కి చేయాల్సిన మర్యాదలు అన్ని బాగా చేశాడు సుబ్బారావు.

" అంకుల్...పెళ్లి కూతురును చూపిస్తారా ? " అని అడిగాడు పెళ్లి కొడుకు.

" చూడు బాబూ...! మా చిన్నమ్మాయికి ఇరవై ఏళ్ళు. ఆమెను పెళ్లి చేసుకుంటే ఇరవై

లక్షల కట్నమిస్తాను. మా పెద్దామ్మాయికి ముప్పై ఏళ్ళు. ఆమెను పెళ్లి చేసుకుంటే

ముప్పై లక్షల కట్నమిస్తాను. ఇద్దరిలో ఎవరినైనా చేసుకో " అని మర్యాదగా చెప్పాడు

సుబ్బారావు.

కాసేపు ఆలోచించిన పెళ్లి కొడుకు ఆశగా " అంకుల్..మీకు యాభై ఏళ్ళు దాటిన

అమ్మాయి లేదా " అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుబ్బారావు.