ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు

ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు చేసుకుంటే

“ఏమిటయ్యా నీ సమస్య ?”తనకి దగ్గరికి వచ్చిన పేషెంట్ ను అడిగాడు డాక్టర్.

“ఉదయం నిద్రలేవగానే ఓ గంట తలడిమ్ముగా,తిరుగుతున్నట్లు,కళ్ళముందు మెరుపులు

కనిపిస్తున్నాయ్ సర్ "అని చెప్పాడు ఆ పేషెంట్.

“హహహ..."అని నవ్వి

"నీ సమస్యకు పరిష్కారం సులభం.”అన్నాడు డాక్టర్.

“ఏమిటి సర్ అది ?”అతృతగా అదిగాడు పేషెంట్.

“వెరీ సింపుల్...ప్రతిరోజూ ఓ గంట ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు చేసుకుంటే సరి "

అని పకపక నవ్వాడు డాక్టర్.

“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు పేషెంట్.