TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అప్పు పుట్టించే తాహతు
స్టీఫెన్ లీకాక్
అప్పులు చేయడం చాలా కష్టం అనుకుంటారు జనం.ఎంత ఎక్కువ అప్పు కావాలంటే అంత ఎక్కువ కష్టపడాలని కూడా అనుకుంటారు.అది ఒట్టి అపోహ మాత్రమే.అప్పు చేయడానికి పడే కష్టాల్లోని తేడా స్టేటస్ ని బట్టి మారిపోతూ ఉంటుంది.
ఒక్కసారి ఈ సంఘటనను చూడండి.
“ సుబ్బారావ్, ఓ వంద రూపాయలు అప్పుంటే చూద్దూ, నెలాఖరు కదా...” అన్నాడు అప్పారావు.
“ వంద రూపాయలా ?” నోరు తెరిచాడు సుబ్బారావ్.
“ మళ్ళీ ఇచ్చేస్తానయ్యా బాబూ, నా జీతం రాగానే పువ్వుల్లో పెట్టి మరి యిస్తాను " చెప్పాడు అప్పారావు.
“ ఇప్పటి వరకు చెవిలో పెట్టిన పూలు చాలు " అన్నాడు సుబ్బారావ్.
“ చూడు.పీకల మీదికి వచ్చి పడింది.లేకపోతే అడిగేవాణ్ణి కాదు.” అతృతగా అన్నాడు అప్పారావ్.
“ అంతగా కొంపలు మునిగే పని ఏం చేశావు ?” ఎగతాళిగా అడిగాడు సుబ్బారావ్.
“ హోటల్లో డెబ్భై రూపాయలు బాకీ పడ్డాను.తిండి పెట్టనంటున్నాడు.చాకలి వాడికి ఇరవై బకాయి.అది ఇస్తేనే ఉతికిన బట్టలు ఇస్తానన్నాడు.టైలర్ దగ్గర రిపేరుకు ఇచ్చిన ప్యాంటు అక్కడే ఉండిపోయింది.పది రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళమన్నాడు.” ఉన్నవి లేనివి అన్ని కలిపి చెప్పాడు అప్పారావ్.
“ అవన్నీ నాకెందుకు చెప్పుతున్నావురా ? ” అడిగాడు సుబ్బారావ్.
“ నా బాధలు విని నువ్వు వంద రూపాయలు అప్పిస్తావని " చెప్పాడు అప్పారావ్.
“ ఇంతకు ముందు ఏభై రూపాయలు అప్పిచ్చాను.గుర్తుందా...?”
“ ఎందుకు గుర్తు లేదు ? గుర్తుంది.”
“ పండక్కి పట్టుకొచ్చి యిస్తానని ఒట్టేసి చెప్పావు.నాలుగు పండగలు వెళ్లిపోయాయి ఆ తరువాత.నేను మళ్ళీ దాన్ని కళ్ళ చూడలేడు " అన్నాడు సుబ్బారావ్.
“ అప్పుడేదో వీలుపడలేదు.ఇప్పుడు మాత్రం యమర్జంటు.ఈ వంద లేకపోతే పనినడవడు.నువ్వు మనస్సులో ఏమీ పెట్టుకోకుండా ఇచ్చేయ్.ఒకటో తారీకు జీతం చెక్కు రాగానే, ఫస్ట్ నీ బాకీ తీర్చే ఇంటికి వెళతాను సరేనా...” నమ్మకంగా చెప్పాడు అప్పారావ్.
“ ఇప్పుడు అలాగే అంటావు.ఆ తరువాత మళ్ళీ దాని గురించి పట్టించుకోవు " అన్నాడు సుబ్బారావ్ అక్కడి నుండి ముందుకు కదులుతుండగా...
“ తల్లితోడు సుబ్బారావ్.ఈసారి తప్పకుండా యిస్తాను " నెత్తిమీద చేయి పెట్టుకుని అన్నాడు అప్పారావ్.
“ నాకెందుకో నమ్మకం కలగడం లేదు అప్పారావ్ " అని సుబ్బారావ్ అనగానే,వెంటనే అప్పారావు గబుక్కున...సుబ్బారావు చేతులు పట్టుకుని " ఇదిగో చూడు సుబ్బారావు... ఇవి కాళ్ళు కాదు.నా బాధని అర్ధం చేసుకుని ఆ వంద అప్పుగా ఇవ్వు " అన్నాడు.
ఈ వేడుకోళ్ళు, నిరాకరణలు ఓ అరగంట సేపు సాగాక, అప్పారావు తనమీద, తల్లిదండ్రుల మీద, యావత్తు బంధువర్గం మీద, ఇంటి పక్కింటివాళ్ళ మీద ఒట్లు వేసాక, జన్మ జన్మలకీ ఈ ఉపకారం మర్చిపోనని పడి పడి ప్రాధేయపడ్డాక రాల్తాయి ఆ వంద రూపాయలు.
(హాసం పత్రిక సౌజన్యంతో )
|