Navvule-navvulu

నవ్వులే...నవ్వులు

శవాల గది

“డాక్టర్...నాకు ఆపరేషన్ ఎప్పుడూ చేస్తారు ? ”అడిగాడు పేషెంట్.

“శవాల గదిలో బెడ్ ఖాళీ అయ్యాక....” అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.

చిలిపి జవాబు

“ ఏయ్ మిస్టర్... నీకు అక్కాచెల్లెళ్ళు లేరా ? నా వెంట పడుతున్నావు ? ” కోపంగా అడిగింది పావని.

“ ఉంటే మాత్రం అక్కాచెల్లెళ్ళ వెంట ఎవరయినా పడతారా ? ” చిలిపిగా కన్ను గీటి చెప్పాడు సురేష్.

కళ్ళజోళ్ళు

“ డాక్టర్ గారు నాకు మూడు కళ్ళజోళ్ళు వ్రాసిచ్చారేమిటి ? ” అడిగాడు సూరిగాడు.

“ ఒకటి దూరపు వస్తువులు చూడటానికి, ఒకటి దగ్గరి వస్తువులు చూడటానికి, మరొకటిరెండు కళ్ళజోళ్ళని వెతుక్కోవడానికి.” అని చెప్పాడు డాక్టర్.

“ ఆ....” ఆశ్చర్య పోయాడు సూరిగాడు.

బంగారం ధర

“ నా మెడలో తాళి ఎప్పుడు కడతారు " అడిగింది శశిరేఖా.

“ బంగారం ధర తగ్గాక....” చెప్పాడు అర్జున్.

తొక్కారావు చెప్పిన అడ్రస్

గుండు గుర్నాథం కొత్తగా సిటీకి వచ్చి అడ్రస్ వెతుకుతుండగా, టోపీ తొక్కారావు ఎదురయ్యాడు.

“ ఇక్కడ అప్పుల అప్పారావు ఇల్లెక్కడ ? ” అడిగాడు గుండు గుర్నాథం.

“ బెండప్పారావు ఇంటేదురుగా! ” చెప్పాడు టోపీ తొక్కారావు.

“ మరి బెండప్పారావు ఇల్లెక్కడ ? ” అడిగాడు గుండు గుర్నాథం.

“ అప్పుల అప్పారావు ఇంటేదురుగా ! ” చెప్పాడు టోపీ తొక్కారావు.

“ ఇద్దరి ఇల్లు ఎక్కడ ? ” విసుగ్గా అడిగాడు గుండు గుర్నాథం.

“ ఎదురెదురుగా " అంతకంటే విసుగ్గా చెప్పాడు టోపీ తొక్కారావు.

అక్క కూతురు

“నాకు ఇంట్లో పెళ్ళికొడుకులని చూస్తున్నారు.మీరేం చేయదల్చుకున్నారు ? ” అడిగింది సాహితీ.

“ నువ్వేమి దిగులు పడకు. నాకు అక్క కూతురు రెడీగానే వుందిలే...” అన్నాడు ప్రకాష్.

ఊటీ బిక్షగాడు

“ఇవాళ ఒకరోజు బిక్షం వెయ్యండమ్మా.మళ్ళీ మూడు నెలలదాక కనబడను! ” అన్నాడు బిక్షగాడు.

“ ఎక్కడికి పోతున్నావేమిటి ? ” అడిగింది శకుంతల.

“ఎండాకాలం వచ్చేసింది కదమ్మా.అందుకే ఊటీ వెళ్తున్నా! ” చెప్పాడు బిక్షగాడు.

“ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచింది శకుంతల.

మగవాడి మొదడు - ఆడదాని నాలుక

“ మానవ శరీరంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగాలు ఏమిటి ? ” అడిగింది సైన్స్ టీచర్.

“ మగవాడి మొదడు, ఆడదాని నాలుక " అని ఠక్కున చెప్పాడో పిల్లవాడు.