TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
నవ్వులే నవ్వులు - 7
జాకెట్టు హుక్స్
“ మా ఆవిడ వెనకాల నేను ఒకే పని చేస్తాను " చెప్పాడు హరి, తన
స్నేహితుడు గిరితో.
“ ఏంటది ? ” ఉత్సాహంగా అడిగాడు గిరి.
“ ఆవిడ జాకెట్టు హుక్స్ పెట్టడం " అని చెప్పి పకపక నవ్వాడు.
“ ఆఁ..” నోరు తెరుచాడు గిరి.
ప్రేమ ఆకులతో
“ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళది లవ్ మ్యారేజి అనుకుంటా !” అన్నది కాంతం.
“ ఆ విషయం నువ్వెలా చెప్పగలవు ? ” అడిగింది శాంతం.
“ బంతిలో భోజనాలు పెట్టేటప్పుడు 'లవ్ ' గుర్తు గల ఆకులలో
వడ్డిస్తున్నారు కదా...” అని ఠక్కున చెప్పింది కాంతం.
గుడ్డివాడు
“ ఏంటండి కళ్ళు మూసుకున్నారు ? కళ్ళు
తిరుగుతున్నాయా ?” ఓ రోజు ఉదయం బస్సులో అజయ్
ని అడిగాడు విజయ్.
“ లేదులెండి.ఆడవాళ్ళు నించుంటే నేను చూడలేనంతే "
చెప్పి నాలుక్కరుచుకున్నాడు.
మేకప్ లేని హిరోయిన్లు
“ నాకు కలలో హీరోయిన్లు వస్తున్నారు డాక్టర్ " బాధగా చెప్పాడు పేషెంట్.
“ అందులో అంతగా బాధేముంది ?” ఆశ్చర్యంగా అడిగాడు
డాక్టర్.
“ ష్చ్...కాని వారెవరు మేకప్ లేకుండా వస్తున్నారు డాక్టర్
" మరింత బాధగా చెప్పాడు పేషెంట్.
ఖైది అబ్బాయి
“ భోజనం బాగోలేదంటూ అబ్బాయి
ఉత్తరం వ్రాశాడండి " అంది అన్నపూర్ణ.
“ అలాంటప్పుడు వేరే హోటల్ కెళ్ళి
తినొచ్చు కదా ?” అన్నాడు రావు.
“ అలా తినడం జైల్లో కుదరదటండి " చెప్పి
నాలిక్కరుచుకుంది.
పోలీస్ స్టేషన్
“ మీరు దోచుకున్న డబ్బుని పాడుబడ్డ బిల్డింగ్ లో పంచుకుంటుంటే పోలీసులేలా
పట్టుకున్నారు ?” అడిగాడు ఖైది కన్నయ్య.
“ పాడుబడ్డ బిల్డింగ్ అనుకుని వెళ్ళాము కాని చీకట్లో కనబడలేదు.అదే పోలీసు స్టేషన్ "
చెప్పాడు ఖైది నాగయ్య.
|