కరెంట్ షాక్

కరెంట్ షాక్

 

“నిన్న ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొట్టిందోయ్?” వేలు చూసుకుంటూ విచారంగా చెప్పాడు

గుర్నాధం, పక్క సీటు పరమేశ్వరంతో.

“అదా సంగతి?! అందుకే కాబోలు, నిన్న సిటీ అంతా కరెంటు పోయింది!” అని గొల్లుమని

నవ్వాడు పరమేశ్వరం.