TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అసలైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
ఒక మెకానికల్ ఇంజనీర్, ఎలెక్ట్రికల్ ఇంజనీర్ & సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కలసి ఒక కార్ లో ప్రయాణిస్తున్నారు. ఇంతలో కార్ ఇంజెన్ లో మంటలు వచ్చి కార్ ఆగిపోయింది.
'బహుశా వాల్వ్ కానీ పిస్టన్ కానీ ప్రాబ్లం వచ్చి ఉండవచ్చు. ఇప్పుడప్పుడే అవి మార్చటం కష్టం' అని మెకానికల్ ఇంజనీర్ అన్నాడు.
'అదేం కాదు, స్పార్క్ ప్లగ్ లేదా బాటరీ ప్రాబ్లం అయి ఉండవచ్చు. ఇప్పటికిప్పుడు అవి మనకు దొరకటం కష్టం' అని ఎలెక్ట్రికల్ ఇంజనీర్ అన్నాడు.
'మీరిద్దరూ స్టుపిడ్స్ లా ఉన్నారు. ఒక్క సారి మనం కార్ దిగి మళ్ళీ ఎక్కితే ప్రాబ్లం సాల్వ్ అయిపోవచ్చు కదా...' అన్నాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంప్యూటర్ మొరాయిస్తున్నప్పుడు దాన్ని రీ స్టార్ట్ చెయ్యటం గుర్తుకు తెచ్చుకుని.
|