వాగ్దానం
“ఏమండీ… మొన్న ఎన్నికల్లో గెలిస్తే నాకు పదివేల రూపాయల పట్టుచీర కొనిపెడతామన్నారు. గెలిచి ఆర్నెల్లు అయినా మళ్లీ ఆ ఊసు ఎత్త లేదు” గోముగా అన్నది విశాలాక్షి. “ఓట్లకోసం ఎన్నో వాగ్దానాలు చేస్తాం. అవన్నీ తీరుస్తురా ఎవరైనా విశాలా?” అన్నాడా రాజకీయ నాయకుడు.