Saradagaa Kasepulo Kotta Kotta Appulu

Saradagaa Kasepulo Kotta Kotta Appulu

" సరదాగా కాసేపు " లో కొత్త కొత్త అప్పులు

మారుతున్న కాలంలో పాటు మనుషుల్లోను మార్పు వచ్చింది. ఆ మార్పు ఎంతవరకంటే అప్పులు తీసుకోవడం తిరిగి ఇవ్వడం దాకా వచ్చింది. మరి ఆ అప్పులు ఏమిటో ఇప్పుడు మనం మన కోసం " సరదాగా కాసేపు " అంటూ మనల్ని ఈ రోజు నుండి ప్రతి సోమవారం పలకరించే తెలుగువన్.కామ్/కామెడీ లో తెలుసుకుందాం !

* లిప్ స్టిక్ ఉంటే ఇస్తావా వదినా...రేపు మీ అన్నయ్యగారు తెచ్చాక నువ్వొకసారి

పెట్టుకుందివిగానిలే !

 * మా ' నెట్ ' కనెక్షన్ తీసేశాడు. ఓ గంట మీ ' నెట్ ' వాడుకుంటాను. మా

కనెక్షన్ వచ్చాక మీరు గంట వాడుకోవచ్చు !

 * మీ అబ్బాయికి ఇవాళ సెలవు కదా ! మీ ఆయన్ని మా అబ్బాయిని స్కూల్

దగ్గర డ్రాప్ చేసేయమనండి. వచ్చేవారం మా అయన మీ అబ్బాయిని డ్రాప్

చేసేస్తారు.

 * నీ స్పేర్ ' సిమ్ ' కార్డు ఇవ్వరా !

  * మీ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తాను. సాలరీలు వచ్చాక మణీ రీపే చేసేస్తాను.

 * దూప్ స్టిక్ ఒకటివ్వండి బజారుకి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తాను.