TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది
ఓ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని వార్తలొచ్చాయి. గస్తీ కోసం night watchmanను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరి watchmanku ఉండాల్సిన అర్హత లేమిటి? పని గంటలెన్ని? ఇత్యాది విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక commiteeని వేశారు
ఇక watchman తన duty సరిగ్గా నిర్వహిస్తున్నాడని ఎలా తెలియాలి? అందుకని ఒక superviserని వేశారు.
మరి వీళ్ళిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా? ఓ accountant మరియు time keeperనూ పెట్టారు.
ఇంతమందిని పర్యవేక్షించాలాంటే ఎలా? ఓ officerని వేశారు.
ఆ officerకి ఒక personal secretary, ఒక boy......
తీరా చూసేసరికి budget విపరీతంగా పెరిగి పోయింది. ఉద్యాగాల్లో కోత విధించాలన్న ఉత్తర్వుల మేరకు watchmanను తొలగించారు. -
|