Paapam Mangataayaaru

పాపం మంగతాయారు !

అది అమలాపురం బస్టాండు.

మంగతాయారు కొత్తగూడెం వెళ్ళే బస్సు కోసం ఎదురుచూస్తూ నిలబడి వుంది. బస్సురావడానికి ఇంకా టైం ఉంది. పైగా ఆమెకు ఏమీ తోచక పక్కనే ఉన్న వెయిటింగ్ మిషన్ దగ్గరికి వెళ్లి దాని మీద నిలబడి ఓ కాయిన్ వేసింది.

అందులో నుండి ఒక కార్డు బయటికి వచ్చింది.

ఆ కార్డు మీద " మీ పేరు మంగతాయారు. మీ బరువు 60కిలోలు.మీరు కొత్తగూడెం వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నారు " అని రాసి వుంది.

ఆమెకు ఆశ్చర్యమేసింది. అయోమయంగా ఆ కార్డుని చూస్తుండగా, ఇంతలో ఒకతను వచ్చి ఓ కాయిన్ వేశాడు. కార్డు బయటికి వచ్చింది. దానే మీద " మీ పేరు సత్తిబాబు. మీది దొంతికుర్రు. మీరు మీ మెడికల్ షాపులో మందులకోసం విజయవాడ వెళ్తున్నారు " అని వుంది.

అతనూ ఆశ్చర్యపోయాడు. మంగతాయారు చూస్తుండగా అలా మరో ఇద్దరు కాయిన్స్ వేసి కార్డులను తీసుకున్నారు. అన్నీ కరక్టుగా వచ్చాయి.

కాని ఇవన్నీ ఎలా వస్తున్నాయో అర్థంకాక మంగతాయారు బాగా ఆలోచించి అందులోని కిటుకు తెలుసుకోవాలని బట్టలు మార్చుకుని వచ్చి మళ్ళీ కాయిన్ వేసింది.

కార్డు బయటికి వచ్చింది. అందులో ఇలా వుంది. “ మీ పేరు మంగతాయారు. మీ బరువు 60 కిలోలు. మీరు కొత్తగూడెం వెళ్ళే బస్సుకోసం ఎదురుచూస్తున్నారు.

కాని మీ దురదృష్టం. కొత్తగూడెం వెళ్ళే ఆ ఒకే ఒక బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది " అని. అంతే...మంగతాయారుకు కళ్ళు తిరిగి దనేల్ మణి కిందపడింది.