Old Missamma Parody Song

Old Missamma Parody Song

(" మిస్సమ్మ " చిత్రంలోని " బృందావనమది అందరిదీ " అనే పాటకు పేరడీగా)

 

పల్లవి : ప్రజాస్వామ్యనిది అందరిదీ

ఎన్నికలు అందరి వారివెలే

నాయకులారా ఎందుకు తగువులు

పదవులు అందరికానందములే

!!ప్రజాస్వామ్యనిది అందరిదీ !!


చరణం : సారాబ్రాందీ బీరులు పోసిన

ఓటులు జలజల రాలునులే

దానికి రిగ్గింగ్ తోడై నిలిచిన

తప్పక గెలుపు దక్కునులే

!!ప్రజాస్వామ్యనిది అందరిదీ !!


చరణం : బోగస్ ఓట్లను చేర్పించటలో

ఎవరికి వారు ఘనులులే

వాపే బలమని భావించినచో

ప్రజా శ్రేయసిక అంతేలే

!!ప్రజాస్వామ్యనిది అందరిదీ !!