TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Non Stop Telugu Laughing Jokes
నాన్ స్టాప్ తెలుగు లాఫింగ్ జోక్స్
నవ్వుకోవడంలో ఉన్న సరదా మరెందులోను ఉండదని చాలామంది అభిప్రాయం ! మరి అది నిజమే కదా. అంతెందుకు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే వీలయినంతవరకు నవ్వుతూ ఉండండి. నవ్వుని మించిన టానిక్ ఆరోగ్యానికి మరేది లేదు అని ఎంతోమంది డాక్టర్స్ చెబుతూ ఉంటారు.
సో హాయిగా నవ్వును పంచుతూ, సరదాని పెంచుతూ, ఆరోగ్యంగా ఉంచడమే ఈ నాన్ స్టాప్ తెలుగు లాఫింగ్ జోక్స్ స్పెషల్.
ముందుగా మన Non Stop Telugu Laughing Jokes లో చిలిపి కవిత.
జీవితంలో పెళ్లి చాల ముఖమైనది. ఆ పెళ్ళితో ముడిపడిన భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ చిలిపి కవితలో తెలుసుకుందాం !
పెళ్ళయిన కొత్తలో భార్య - బెటర్ హాఫ్
కొన్నాళ్ళయ్యా అవుతుందామె - బిట్టర్ హాఫ్
మంగళసూత్రంతో పాటు
నల్లపూసలు కట్టినవాడు
పెళ్ళయ్యాక నల్లపూసే అవుతాడు.
పెళ్ళయిన కొత్తలో
మొగుడూ పెళ్ళాం - చిలకాగోరింక
కొన్నాళ్ళయ్యాక
ఒకరికొకరు - బోరింక.
*************************
మన Non Stop Telugu Laughing Jokes లో ఇప్పుడు కొంటె ప్రశ్నలు - తుంటరి జవాబులు. మరి ఆ కొంటె ప్రశ్నలు తుంటరి జవాబులు ఏంటో అవి ఎలా ఉంటాయో చూద్దాం.
ప్రశ్న : పోటీ పెరిగేలా పాడేవాడు ?
జవాబు : వేలంపాట పడేవాడు
ప్రశ్న : దారులు కొట్టి బ్రతికేవాడు ?
జవాబు : రోడ్డు మేస్త్రి
ప్రశ్న : కొంపలార్చి బతికేవాడు ?
జవాబు : పైర్ సర్వీస్ మెన్.
ప్రశ్న : పిల్లల్ని ఏడ్పించే బ్రతికేవాడు ?
జవాబు : చిల్డ్రన్స్ స్పెషలిస్ట్.
***************************
మన నాన్ స్టాప్ తెలుగు లాఫింగ్ జోక్స్ లో పేరు రిపేరు చేస్తారంటా. అదెలాగో మనం తెలుసుకుందాం !
* ప్రియా ఓ ప్రియా - నీ కోసం - వేచిఉంటా - ప్రేమతో - చంటిగాడు.
* నువ్వు నేను - ప్రేమించుకుందాం రా - ఐతే - ఆ ఒక్కరి అడక్కు.
* కెప్టెన్ నాగార్జున - ముద్దుల మామయ్య - ఐతే - సత్యం - ముద్దుల మేనల్లుడు.
* నువ్వు నేను - పెళ్లి చేసుకుందాం - సారీ నాకు పెళ్లయింది.
|