TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
Navvule Navvulu - 17
**********************
“ అతనేంటి పేరడిగితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవైపు చూపించి వెళ్ళిపోతున్నాడు ?”
బాధగా తన పక్కనే ఉన్న వ్యక్తిని అడిగాడు సుబ్బారావు.
“ ఓ...అతనా...అతని పేరు ఏడుకొండలు. సోమవారం రోజున మౌనవత్రం. మాట్లాడడు " అని
పకపక నవ్వాడు ఆ వ్యక్తి.
“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుబ్బారావు.
*******************************************
“ ఏమిటి వెంకటయ్య? నేను తిరుగుబోతుననీ, తాగుబోతుననీ, భార్యను వేధిస్తుంటాననీ,
లంచగొండిననీ అందరికీ చెబుతున్నావట? ” కోపంగా అడిగాడు మేనేజర్ సుబ్బారావు.
“ క్షమించండి సార్...!ఇవన్నీ మీ రహస్యాలని నిజంగా నాకు తెలియదు " అని
అమాయకంగా అన్నాడు వెంకటయ్య.
“ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు మేనేజర్ సుబ్బారావు.
************************************************
“ నిన్ను రేపు ఉరితీయబోతున్నాం. నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు ?” అని ఖైదితో అన్నాడు
జైలర్.
“ నిజంగా తీరుస్తారా ?” అని అనుమానంగా అన్నాడు ఆ ఖైది.
“ ఖైది యొక్క చివరి కోరిక తీర్చడం మా బాధ్యత. తప్పకుండా తీరుస్తాం. అదేంటో చెప్పు ?”
నమ్మకంగా, గట్టిగా చెప్పాడు జైలర్.
“ నాకు పెద్దగా కోరికేం లేదు కాని, మెడకు ఉరితాడు బిగిస్తే నాకు చక్కిలిగింతలు పెట్టినట్లు
ఉంటుంది. అందుకని ఆ తాడేదో నా నడుముకి బిగించండి చాలు " అని తన చివరి కోరికను
చెప్పాడు ఆ ఖైది.
అది విని " ఆ...” అని నోరు తెరిచాడు జైలర్.
*********************************************
“ సూటు బూటు వేసుకుంటే ఆడపిల్లలు వెంటబడతరన్నావు?” అని సుధాకర్ ను రవ్వంత
అడిగాడు గోపాల్.
“ అవును. పడ్డారా ?” కుతుహాలంగా అడిగాడు సుధాకర్.
“ ఆడపిల్లలు పడలేదుకాని బిచ్చగాళ్ళు వెంటబడుతున్నారు " విచారంగా అన్నాడు
గోపాల్.
అదివిని పకపక నవ్వాడు సుధాకర్.
అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు గోపాల్.
***************************************
“ మనం పెళ్లి చేసుకున్నాం. అందరిలా గొడవలు పడకుండా హ్యాపీగా ఉందాం. సరేనా వినతి
" అని భార్యతో అన్నాడు భర్త అయోమయం.
“ సర్లేగానీ...ఫంక్షన్ హాల్లో ''అయోమయం వెడ్స్ వినతి'' అని బోర్డు పెట్టారేంటి. ''వినతి వెడ్స్
అయోమయం '' అని పెట్టొచ్చు కదా !” అని గట్టిగా అన్నది భార్య వినతి.
“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు భర్త అయోమయం.
******************************************
|