Navvule Navvulu 14

నవ్వులే నవ్వులు - 14

*******************************************************************

Timepass lingam

“ సూటు బూటు వేసుకున్న నిన్ను చూస్తుంటే గొప్పింటి వాడిలా ఉన్నావు !" అన్నాడు జడ్జి.

" అవును సార్. నేను గొప్పింటి వాడినే." చెప్పాడు లింగం.

" మరి ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు?” అడిగాడు జడ్జి.

“ టైం పాస్ కోసం సార్...” చెప్పాడు లింగం.

***********************************************************************

Antharatma

“ ఒరేయ్ కిట్టు...నువ్వు నా జేబులో నుండి వంద రూపాయలు దొంగలిస్తున్నప్పుడు నీ

అంతరాత్మ అది తప్పని చెప్పలేదా ?” అడిగాడు తండ్రి.

“ చెప్పింది డాడీ.కానీ చెప్పుడు మాటలు వినోద్దని నువ్వే చెప్పావు కదా !” తెలివిగా చెప్పాడు కిట్టు.

“ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి.

***********************************************************************

Miru kuda pote

“ అందరికి నమస్కారం ! నా కుడి పక్కనున్న సర్పంచ్ గారు పొతే...పార్టీ పెద్దలు

పరంధామయ్య గారు పొతే...హెడ్ మాస్టర్ గోపాలరావు గారు పొతే...మేడమ్ పార్వతమ్మ

గారు పొతే...” అని ఒక సభలో ఒక పెద్ద మనిషి ఉపన్యాసం యిస్తున్నాడు.

ఈ పొతే...పొతే...అనే పదం వినీ వినీ అసహనంగా లేచిన ఒక వ్యక్తీ " అయ్యా !పొతే...పొతే..

అంటూ అందరిని పంపించి, వారితో పాటు మీరు పొతే...మేం కాస్త ఊపిరి పీల్చుకుంటాము "

అంటూ అరిచాడు.

***********************************************************************

Sweets

“ చాలా బాగుంది " అన్నాడు పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి.

“ అయితే ముహూర్తాలు పెట్టుకుందామా ?” సంతోషంగా అడిగాడు అమ్మాయి తండ్రి.

“ నచ్చింది మీ అమ్మాయి కాదు. మీరు పెట్టిన స్వీట్స్ " సిగ్గు పడుతూ చెప్పాడు ఆ

అబ్బాయి.

***********************************************************************

Worest Mummy

“ మమ్మీ...నువ్వు రోజు పౌడరెందుకు రాసుకుంటావు ?” అడిగింది కూతురు రోజా.

“ అందంగా కనబడాలని రోజా " చెప్పిందితల్లి.

“ అవునా...అయితే మొదట్లో నువ్వు ఇంతకన్నా వరస్ట్ గా వుండేదానివన్నమాట "

అమాయకంగా అంది కూతురు రోజా.

***********************************************************************