TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Naa Modati Bharya-Telugu Joke
*************
ఒక దొంగ అర్థరాత్రి గుర్నాథం ఇంట్లో దూరాడు.
భార్యాభర్తలను బెదిరించి, స్థంభానికి కట్టేసి, బీరువాలోని నగలు, డబ్బులు
అన్నింటీనీ మూటకట్టుకుని వాటి లిస్టు తయారు చేశాడు.
“ ఈ కాగితంలో మీరిద్దరూ సంతకం పెట్టండి " అన్నాడు ఆ దొంగ వారికి కాగితాన్ని,
పెన్నును అందిస్తూ.
“ ఏ..ఏ...ఎందుకు ?” భయపడుతూ అడిగారు గుర్నాథం దంపతులు.
“ వీటిల్లో నేనేదైనా నా రెండో భార్యకు యిచ్చేశానని నా మొదటి భార్య
అనుమానిస్తుంది కాబట్టి" అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు ఆ దొంగ.
"ఆ..." అని గుర్నాథం దంపతులిద్దరూ ఆశ్చర్యంగా నోరు తెరిచారు.
|