Rating:             Avg Rating:       665 Ratings (Avg 2.89)

మై డియర్ రోమియో - 43

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 43

 

స్వప్న కంఠంనేని

 

అప్పుడు సాయంత్రం అయిదవుతోంది.
ఆకాశం నీలి రంగులో ఉంది. తెల్లటి మబ్బులు దూది పింజల్లా కదులుతున్నాయి. ఏదో అన్వేషణలో ఉన్నట్టుగా పిట్ట ఒకటి ఆకాశంలో వంటరిగా ఎగురుతూ పోతోంది.
"సగం మబ్బు సూర్యునిపై శాటిన్ తెరలా కప్పుతుంది. సంజె ఎరుపు సెలయేటిపై చల్లిన తొలిసిగ్గులా ఉంది''
హనితకి తిలక్ కవిత గుర్తొచ్చింది.
"నేను పుట్టి ఎదిగాక ప్రకృతి ఇంత అందంగా ఉండటం ఇదే మొదటిసారి' అమాయకంగా అనుకుందామె. రోజూ ఉండే లోకమే ప్రేమలో పడ్డాక రంగు రంగులు.
గానూ, అత్యద్భుతంగానూ కనిపిస్తుందని ఆమెకి తెలీదు.
డాబా పైకి పాకిన జాజి తీగల్ని ఆప్యాయంగా స్పృశించింది.
దూరంగా రోడ్డు కవతల కనిపిస్తున్న గుల్ మొహర్ చెట్టువేపు ప్రేమగా చూసింది.
ఉన్నట్లుండి హనితకి వాళ్ళ తెలుగు మేడమ్ అన్న మాటలు గుర్తొచ్చాయి.
"సూర్యుడు విప్లవ కారుడికి ధనవంతుడి అమానుషత్వానికి గురైన పేదవాడి రక్తంగా కనిపిస్తే. భావుకుడికి స్త్రీ నుదుటినున్న సింధూర తిలకంలా అనిపిస్తాడు. తిండిపోతుకైతే అదే సూర్యుడు ఎర్రటి పండులా కనిపిస్తాడు అని తెలుగు మేడమ్ చెప్పింది నిజమే. లేకపోతే నిన్నటి వరకూ మల్లెలోనూ గులాబిలోనూ ఏ అందమూ కనిపించని నాకు ఇవాళ ఎక్కడో దూరంగా ఉన్న గుల్ మొహర్ చెట్టు ఇంత అందంగా ఆత్మాయంగా అనిపిస్తోందేమిటి?'' నవ్వుకుంది.
కానీ నేను వైభవ్ ని ప్రేమిస్తున్నానన్న సంగతి ఇంట్లో వాళ్ళకు తెలిస్తే?
సడన్ గా వచ్చిన ఆ ఆలోచనకు భయంతో అప్రయత్నంగా గుండెల మీద చెయ్యేసుకుంది హనిత - ది డేర్ డెవిల్ హనిత!
ప్రేమ ఆమెలో దర్యగుణాన్ని వెనక్కు నెట్టేసి ఆ స్థానంలో స్త్రీ సహజమైన బేలతనాన్ని ప్రవేశపెట్టింది.
"అసలయినా వైభవ్ అంటే మమ్మీ డాడీలకు మొదట్లో అంత కోపం ఉండేది కాదులే. నేనే సగం నేర్పాను. లేనిపోనివి కల్పించి చెప్పి మరీ నాకు నేనుగా చేసుకున్ననిదంతా. ఎందుకలా చేశానో ఏమో'' అనుకుని తనని తనే తలమీద చిన్నగా కొట్టుకుంటుండగా హనిత చిన్నన్నయ్య హేమంత్ మెట్లెక్కి పైకి వచ్చాడు.
కోపంగా మొహం మరో వేపుకి తిప్పుకుంది.
"ఏంటి హనీ! నామీద అలిగావా?'' అన్నాడు హేమంత్.
హనిత ఇంకా ఏమీ మాట్లాడకముందె తనే మళ్ళీ నవ్వుతూ అన్నాడు.
"వాసంతిని మాత్రం భలేగా ఆట పట్టించావ్ లే. మైసమ్మని తీసేస్తవా? లేదా అని నా ప్రాణం తీసేసిందనుకో''
హనితకి నవ్వు రాలేదు.
"ఈ మగవాళ్ళకి ఎంత స్వార్థమో. తన ఫ్రెండ్ గురించి చిన్నన్నయ్యగాడు ఎంత సంతోషంగా చెప్తున్నాడో, అసలు మగవాళ్ళందరూ ఇంతే. ప్రతి మగవెధవకీ, తన ప్రేమకథ అమత్రమే ఉదాత్తంగానూ, మిగిలిన వాళ్ళ ప్రేమలు చీప్ గానూ, వల్గర్ గానూ అనిపిస్తాయి. లేకపోతే మొన్న వైభవ్ ని చూడటానికి వెళ్ళానని ఎంత రభస చేశాడో మర్చిపోయి ఇప్పుడొచ్చి వాసంతి గురించి సంబరంగా చెప్తున్నాడు. ఇడియట్'' కసిగా అనుకుని చరచరా మెట్లు దిగేసి తన రూమ్ లో కెళ్ళి తలుపేసుకుంది.
అర్థంకాని హేమంత్ ఆమె వెళ్ళినవేపు ఆశ్చర్యంగా చూస్తుండి పోయాడు ....
టక్ చేసిన దుస్తుల్లో, యవ్వనంతో మడిసి పడుతున్న దేహంతో, గుండ్రంగా, ముద్దుగా ఉండే మొహంతో వైభవ్ అప్పుడే క్లాస్ లోకి ప్రవేశించాడు.
ఎంటరవుతూనే ఎదురుగా ఫస్ట్ బెంచ్ లో కనిపించిన హనిత వేపు చూశాడు. అతని కోసమే అన్నట్టుగా వాకిలివేపు పడిగాపులు పడుతూ చూస్తున్న హనిత అతని కళ్ళలోకి చూడబోయింది.
అతని చూపులు తన చూపులతో కలవగానే మాత్రం అప్రయత్నంగా తత్తరపడి తలదించుకుంది.
అప్పటికింకా ఎవ్వరూ క్లాస్ లోకి రాలేదు. తనూ, హనిత మాత్రమే ఉన్నారు ఒంటరిగా.
ఆ విషయం గుర్తుకు రాగానీ "ఇప్పుడు సడన్ గా ఏదో గోల లేవనెత్తుతుంది. ఎందుకొచ్చిన గొడవ. బయటికి వెళ్తే బాగుంటుంది'' అనుకుంటూ వెంటనే వెనక్కి తిరిగాడు.
"వైభవ్, నీకెంత నిర్లక్ష్యం?'' అనుకుంది హనిత తనలో తను బాధగా.
కాసేపయింది. "అనవసరంగా తొందరగా వచ్చానేమో'' మళ్ళీ అనుకుందామె. ఆమె మనస్సు బాగా విలమైపోయింది. ఇంకా క్లాసులో కూర్చోవాలనిపించలేదు.
ఒకరొకరుగా స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లోకి చేరుకుంటుంటే ఆమె ఏదో పని ఉన్నట్టుగా బయటికి నడిచింది. లాన్ లోకి వచ్చింది.