Rating:             Avg Rating:       748 Ratings (Avg 3.00)

నేనూ - దొంగాడూ - 2

Listen Audio File :

Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

 

నేనూ - దొంగాడూ - 2

 

- మల్లిక్

 

ఇద్దరం చాపమీద కూర్చుని పుస్తకాలు తెరిచాము.
'కాలము-పని' లెక్కలు రెండు చేసి చూపించాడు చంచల్రావు.
"ఇంకా ఈ ఎక్సర్ సైజు మొత్తం నువ్వు చెయ్యి'' అన్నాడు.
"నేను 'అలాగే' అని అనబోయి కళ్ళు తేలవేశాను.
"ఏం? ... ఇంకా అర్థం కాలేదా? మరో లెక్క చేసి చూపించనా?'' అని అడిగాడు చంచల్రావు.
నేను వాడికి సైగచేసి గుమ్మంవైపు చూపించాను.
చంచల్రావు అటువైపు చూసి వాడు కూడా కళ్ళు తేలవేశాడు.
గుమ్మంలో ఎవరో నిలబడి ఉన్నాడు.
పొట్టిగా కత్తిరించిన జుట్టు - నల్లగా, సన్నగా ఉన్నాడు.
"వార్నీయెవ్వ ... ముంగట్ కెళ్ళి చూసి తాలమేసుంటే ఎవ్వళ్లుండరని ఎనకకెళ్ళి వచ్చా ... మీర్ కమ్రలోనే ఉన్నార్ వయ్య?'' అన్నాడు వాడు మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ.
కాస్సేపు మా ఇద్దరికీ నోట మాట రాలేదు.
వాడు రెండడుగులు మావైపు వేశాడు.
ఇద్దరం గబుక్కున లేచి నిలబడ్డాం.
"ఎవడ్రా నువ్వు?'' అన్నాడు చంచల్రావు ధైర్యం చేసి.
"నా పేరు రాంలు'' అన్నాడు వాడు చిత్రంగా చూస్తూ.
అడగ్గానే జవాబిచ్చినందుకు నాకూ ధైర్యం వచ్చింది.
"ఎందుకు వచ్చావ్?'' అని అడిగాను.
"దొంగతనానికి ...'' అన్నాడు వాడు ఏమాత్రం తొణక్కుండా.
"రాస్కెల్ .. ఏమిట్రా కూస్తున్నావ్?'' అంటూ చంచల్రావు వాడివైపు రెండడుగులు వేశాడు.
హఠాత్తుగా వాది చేతిలో కత్తి ప్రత్యక్షమైంది.
నేను కెవ్వున కేకేశాను. చంచల్రావు కంగారుపడిపోయాడు.
"హహా ... ఈ రాంలు అంటే ఏంటో సమజైందా మల్ల .. సూసినావ్ బే ... నీ దోస్త్ కత్తి చూసి గెట్ల పరేషాన్ అవుతుండో'' అన్నాడు రాంలు నాతో.
"చుప్ ... నిన్ను చూసి నేను కంగారు పాడడం ఏమిటి? మావాడు పెట్టిన కేకకి కంగారుపడ్డానుగానీ ...'' వాడివైపు మరో రెండడుగులు వేశాడు చంచల్రావు.
రాంలు కత్తి పట్టుకున్న చెయ్యి పైకిలేపాడు. "కరీబొచ్చినా వంటే పొడిచేస్తా ... ఖబడ్దార్'' అన్నాడు.
"ఒరేయ్! వద్దురా! చెంచిగా ...'' అన్నాను నేను అరుస్తూ.
చంచల్రావు నవ్వి మరో అడుగు ముందుకేశాడు. "ఏమోయ్ ... నీకు దొంగతనం చెయ్యడం ఇదే మొదలా?''
రాంలు కంగారు పడిపోయాడు.
"నేనా ... కొత్తా? ఎవల్జెప్పిన్రు ... చిన్నప్పటి సందినే నిండ్లనే ఉన్నా. మర్డర్లూ, రేపులూభి చేసినా ... అగో మల్ల .. కరీబ్ రాకు ... పొడిసేస్తా '' అనంటూ కత్తి ఉన్న చెయ్యి మరీ పైకి లేపాడు.
"కత్తిపట్టుకోవడమే రాదు నువ్వెక్కడి దొంగవయ్యా?'' అంటూ నవ్వాడు చంచల్రావు.
రాంలు కంగారుపడిపోతూ కత్తివంక చూసుకున్నాడు. అంతవరకూ కంగారులో నేను గమనించలేదు. రాంలు కత్తికి పదును ఉండే వైపు పట్టుకుని పిడి మా వైపు ఉండేలా పెట్టాడు.
తను కత్తి ఎలా పట్టుకున్నాడో చూసుకున్న రాంలు మరింత కంగారు పడిపోయి కత్తిని మామూలుగా పట్టుకోబోయాడు. కానీ, చంచల్రావు మెరుపులా వాడిమీదికి దూకి, వాడిని గట్టిగా వాతెసుకున్నాడు. పెనుగులాటలో రాంలు చేతిలోని కత్తి జారి క్రింద పడిపోయింది.
నేను కూడా ధైర్యం చేసి ముందుకు దూకి రాంలును గట్టియా పట్టుకుని "దొంగ ... దొంగ'' అని అరిచాను.
నా అరుపులకి గది బయట జనం మూగారు.
"అందర్ కైసా ఆనా ... బయట గుఫల్ ఉందే ...'' అన్నాడు పక్కింటి రాఫూఫ్. "లోపలెట్లుండిన్రయా మీరు'' అని కేకేశాడు అదే వీథిలో ఉందే షావుకారు యాదగిరి.
"వెనుకవైపు నుండి తలుపు తెరుచుంది'' నేను మరీ గట్టిగా అరిచాను.
గదిలోకి బైబిల మంటూ జనం వచ్చేశారు.
"తన్నండి వెధవని ... మరీ ఇంట పెందలాడే దొంగతనమా?'' ఎవరో అన్నారు.
"రేపట్నించి అర్ధరాత్రే వస్తాను ... నన్ను వదులున్రి'' అన్నాడు రాంలు. అందర్నీ బిక్కు బిక్కుమని చూస్తూ.
"దొంగతనం చేస్తావు బే?''
పది చేతుల పిడికిళ్ళు బిగించి గాల్లో లేచాయి.
"ఆగండి'' అరిచాడు చంచల్రావు.
వాళ్ళు ఆగారు.
"వీడిని మనం ఎందుకు తన్నడం ...''
"అయితే పోలీసులకి అప్పజెప్పుదాం'' ఎవరో అన్నారు.