Konte Questions-Tuntari Jawabulu-8

కొంటె కొశ్శె న్లు - తుంటరి జవాబులు - 8

***********************************************************************

కొంటె కొశ్శెన్ : లైబ్రేరియన్ తిక్క కుదిరేదేప్పుడు ?

తుంటరి జవాబు  : వస పిట్టలాగ వాగే భార్య దొరికినప్పుడు.

**********************************************************************

కొంటె కొశ్శెన్ : పెళ్లిపెటాకులు లేకుండా ఎదిగిన కూతురు గుదిబండ అయితే, మరి ఉద్యోగం

సద్యోగం లేకుండా ఎదిగిన కొడుకు ఏమవుతాడు ?

తుంటరి జవాబు : అనకొండ

***********************************************************************

కొంటె కొశ్శెన్ : మా ఇంటి పక్కన ఓ అమ్మాయి వుంది.తను పార్వతీదేవి అంశ అని చెబుతూ,

ఏవేవో భ్రమల్లో బతుకుంది.తను పేరు మార్చుకోవాలనుకున్నప్పుడు ఏ పేరు సజెస్ట్ చేస్తే

మంచిదంటారు?

తుంటరి జవాబు : భ్రమరాంబ

***********************************************************************

కొంటె కొశ్శెన్ : దేవాలయాల్లో పూజరులకి 'రేట్లు 'ఎందుకు నిర్ణయిస్తారు ?

తుంటరి జవాబు : కోవెలలో వెల ఉంది కాబట్టి.

***********************************************************************

కొంటె కొశ్శెన్ : కొందరు ఆడవాళ్ళు ఎందుకు ప్రతి విషయానికి ఎక్కువగా స్పందిస్తారు ?

తుంటరి జవాబు : వాళ్ళు 'అతి 'వలు కాబట్టి.

***********************************************************************

కొంటె కొశ్శెన్ : అధికమాసం వస్తే ఆనందపడేది ఎవరు ?

తుంటరి జవాబు : కొత్తగా వ్యాపారంలో దిగిన వడ్డీ వ్యాపారి వాళ్ళు.

***********************************************************************

కొంటె కొశ్శెన్ : ప్రజలు బేజారయ్యేది ఎప్పుడు ?

తుంటరి జవాబు : పదవినుంచి దిగుతూ 'నా సహాయనిధి నాకిచ్చేయండి' అని ప్రధానమంత్రి

అన్నప్పుడు.

***********************************************************************