TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Konte Questions-Tuntari Jawabulu-10
**********************
కొంటె ప్రశ్న : నాలుగు రాళ్ళు వెనకెయ్యాలంటే ఏం చెయ్యాలి ?
తుంటరి జవాబు : క్వారీలో రాళ్ళను లారీలకెత్తి ట్రాన్స్ పోర్ట్ చెయ్యాలి.
******************************
కొంటె ప్రశ్న : వాయిదా వెయ్యలేనిది ?
తుంటరి జవాబు : దురద పుడుతుంటే గోక్కోవడం.
***********************
కొంటె ప్రశ్న : ఫస్ట్ డిటెక్టివ్, ఫస్ట్ హిప్నాటిస్ట్, ఫస్ట్ మెజీషియన్, ఫస్ట్ వెంట్రిలాకవిస్ట్, ఫస్ట్
మిమిక్రీ ఆరిస్ట్, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరో మీకు తెలుసా ?
తుంటరి జవాబు : తెలుగు...సీత ఎక్కడుందో కనుక్కున్న హనుమంతుడు ఫస్ట్ డిటెక్టివ్,
అతని బలాన్ని అతనికి తెలియజెప్పి నమ్మకం కలిగించిన జాంబవంతుడు ఫస్ట్ హిప్నాటిస్ట్,
నోట్లోనే పద్నాలుగు లోకాలు చూపించిన శ్రీకృష్ణుడు ఫస్ట్ మెజీషియన్, కోడి గొంతును
అహల్య కోసం అనుకరించిన ఇంద్రుడు ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్, రాముడి గొంతును మిమిక్రీ చేసి
వాయిసుని త్రో చేసిన మారీచుడు ఫస్ట్ వెంట్రలాక్విస్ట్, తల్లి గర్భంలో కాకుండా కుండలో
జీవం పోసుకున్న ద్రోణాచార్యుడు ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబి!
****************************
కొంటె ప్రశ్న : అరకొస్తారా ?
తుంటరి జవాబు : పావుక్కూడా రాను.
******************************
కొంటె ప్రశ్న : పెళ్లి అయిన వాడికి, కాని వాడికి తేడా ?
తుంటరి జవాబు : పెళ్లి అయినవాడు మిస్ ని మిసెస్ చేస్తాడు, కానివాడు మిసెస్ ని మిస్
చేస్తాడు.
*******************************
కొంటె ప్రశ్న : పెరుగుట విరుగుట కొరకే " అనే సామెతను నెగిటివ్ మీనింగ్ లో చెప్పగలరా ?
తుంటరి జవాబు : ధరలు పెరుగుట నడ్డి విరుగుట కొరకే.
|