TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Kiran Athitelivigaa
క్లాసు రూములో వ్యతిరేక పదాల గురించి చెబుతున్నాడు తెలుగు పండితుడు.
" రాత్రికి పగలు, సూర్యుడికి చంద్రుడు, జయమునకు అపజయము....పిల్లలు వ్యతిరేక పదాలు
విన్నారు కదా...ఇప్పుడు నేను కొన్ని పదాలను అడుగుతాను. వాటికి మీరు వ్యతిరేక పదాలు
చెప్పాలి అర్థమయిందా " అని గట్టిగా అన్నాడు పండితుడు.
" అర్థమయింది సార్ " అని మరింత గట్టిగా అన్నారు పిల్లలు.
" ఒరేయ్ కిరణ్... పండితుడు కి వ్యతిరేక పదం చెప్పరా " అని కిరణ్ అనే ఒక పిల్లవాడిని అడిగాడు
తెలుగు పండితుడు.
కిరణ్ గబుక్కున లేచి నిలబడి " పామరుడు " అని చెప్పాడు.
" అలాగే స్నేహితుడికి వ్యతిరేక పదం చెప్పు " అని మళ్ళీ కిరణ్ ను అడిగాడు తెలుగు పండితుడు.
" శత్రువు " అని చెప్పాడు కిరణ్.
" మంచివాడికి చెప్పు " అన్నాడు తెలుగు పండితుడు.
" చెడ్డవాడు " అని చెప్పాడు కిరణ్.
" నువ్వేకావాలికి చెప్పు " అని అడిగాడు తెలుగు పండితుడు.
" నేనే వెళ్ళాలి. వెళ్తున్నాను " అని కిరణ్ గబుక్కున ఆ క్లాసు రూము నుండి వెళ్ళిపోయాడు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అలా చూస్తుండిపోయాడు తెలుగు పండితుడు.
|